స్వయంకృషితో ఒకేసారి 9 ప్రభుత్వ ఉద్యోగాలు

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు.  ఒక్క గవర్నమెంట్‌ జాబ్‌ రావడమే గ్రేట్‌ అనుకునే ఈ రోజుల్లో 9 ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు. ప్రయత్నించాలే కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి ఇతనే ఉదాహరణగా నిలుస్తున్నాడు. కర్ణాటక యాదగిరి జిల్లా యరగోల గ్రామానికి చెందిన వెంకటేష్‌..ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు నాగమ్మ, బసవర్జ్‌ చట్నల్లి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే కావడంతో స్థానికంగా ఉండే సర్కారీ బళ్లోనే చదువుకున్నాడు. తల్లి, […]

స్వయంకృషితో ఒకేసారి 9 ప్రభుత్వ ఉద్యోగాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 1:38 PM

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు.  ఒక్క గవర్నమెంట్‌ జాబ్‌ రావడమే గ్రేట్‌ అనుకునే ఈ రోజుల్లో 9 ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు. ప్రయత్నించాలే కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి ఇతనే ఉదాహరణగా నిలుస్తున్నాడు.

కర్ణాటక యాదగిరి జిల్లా యరగోల గ్రామానికి చెందిన వెంకటేష్‌..ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు నాగమ్మ, బసవర్జ్‌ చట్నల్లి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే కావడంతో స్థానికంగా ఉండే సర్కారీ బళ్లోనే చదువుకున్నాడు. తల్లి, తండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ వెంకటేష్‌ను కష్టపడి చదివించారు. ఐతే వెంకటేష్‌ డిగ్రీ వరకు సాధారణ స్టూడెంటే. ఐనా తల్లిదండ్రులు మాత్రం అతన్ని ఉన్నతస్థానంలో చూడాలనుకున్నారు. దీంతో కన్నవారి శ్రమను చూసి ఎలాగైనా తాను మంచి జాబ్‌ సంపాదించాలనే కసి పెరిగింది వెంకటేష్‌లో. కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యాడు. రాత్రి, పగలు తేడా లేకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టి ఎగ్జామ్స్‌ రాశాడు. దీంతో ఒకేసారి 9 ప్రభుత్వోద్యోగాలు వెంకటేష్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.

జైలర్, ఎస్డీఏ, ఎఫ్డీఏ, ఎక్సైజ్ గార్డ్, సీనియర్ అకౌంటెంట్ లాంటి ఉద్యోగాలు వచ్చాయి. వాటిలో అతనికి నచ్చిన కేఎఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఎంచుకుని స్థిరపడ్డాడు వెంకటేష్‌. ప్రస్తుతం యాదగిరి జిల్లా పంచాయతీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తన తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.