BSF: మరోసారి వక్రబుద్ధి చూపెట్టిన పాకిస్థాన్.. గట్టి ఎదురుదెబ్బిచ్చిన భారత్
పాకిస్థాన్ మరోసారి భారత్‌పై కట్ర చేసేందుకు యత్నించింది. పంజాబ్ అమృత్‌సర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా వచ్చిన మూడు పాకిస్థాన్ డ్రోన్లను శుక్రవారం రాత్రి సరిహద్దు భద్రతా దళం(BSF) కూల్చివేసినట్లు ఆ దళం ప్రతినిధి శనివారం తెలిపారు.
పాకిస్థాన్ మరోసారి భారత్‌పై కట్ర చేసేందుకు యత్నించింది. పంజాబ్ అమృత్‌సర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా వచ్చిన మూడు పాకిస్థాన్ డ్రోన్లను శుక్రవారం రాత్రి సరిహద్దు భద్రతా దళం(BSF) కూల్చివేసినట్లు ఆ దళం ప్రతినిధి శనివారం తెలిపారు. అలాగే ఒక డ్రోన్ నుంచి 2.6 కిలోల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఒక డ్రోన్లను కూల్చివేసినప్పుడు ఒక డ్రోన్ పాకిస్థాన్ ప్రాంతంలో పడిపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయామని తెలిపారు.
ఈ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగుతోందని.. వీటిపై చర్యలు తీసుకునేందుకు బీఎస్‌ఎఫ్, పంజాబ్ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన రెండ్రోజులకే ఈ మూడు డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబడటం వాటిని సరిహద్దు సరిహద్దు దళం కూల్చివేయడం జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి