Anuradha Paudwal: భారతీయ జనతా పార్టీలోకి అనురాధ పౌడ్వాల్.. ఎక్కడి నుంచి పోటీ అంటే..?
బాలీవుడ్ ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ రాజకీయ ప్రవేశం చేశారు. లోక్ సభ ఎన్నికల తరుణంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇంచార్జ్ అరుణ్ సింగ్ సమక్షంలో అనురాధ బీజేపీలో చేరారు
బాలీవుడ్ ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ రాజకీయ ప్రవేశం చేశారు. లోక్ సభ ఎన్నికల తరుణంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇంచార్జ్ అరుణ్ సింగ్ సమక్షంలో అనురాధ బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల తేదీలను మరికాసేపట్లో ప్రకటించనున్నారు. అంతకుముందే అనురాధ కషాయం కండువా కప్పుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరికి పెద్ద బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆమె బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కావచ్చని సమాచారం. అనురాధ హిందీ చిత్రసీమలో ప్రసిద్ధ గాయని. మరాఠీతోపాటు హిందీ, తమిళం, ఒడియా, నేపాలీ భాషల్లో పాటలు పాడారు. 1973లో ‘అభిమాన్’ సినిమాతో నేపథ్యగానం రంగంలోకి అడుగుపెట్టారు. సినిమా పాటలే కాకుండా భజనలకు కూడా పేరు తెచ్చుకున్నారు.
‘ఆషికీ’, ‘దిల్ హై కి మంత నహిన్’, ‘బేటా’ వంటి చిత్రాలలో పాటలకు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. అనురాధ పౌడ్వాల్ ఐదు దశాబ్దాలకు పైగా గాన రంగంలో పనిచేస్తున్నారు. గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంబాజీ, భోజ్‌పురి, నేపాలీ, మైథిలీ వంటి వివిధ భాషలలో 9 వేలకు పైగా పాటలు అలపించారు. అలాగే 1,500 కంటే ఎక్కువ శ్లోకాలను రికార్డ్ చేశారు.
పార్టీలో చేరిన అనంతరం అనురాధ మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మంతో బలమైన అనుబంధం ఉన్న ప్రభుత్వంలో నేను పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. బీజేపీలో చేరడం నా అదృష్టం అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు, “నాకు దాని గురించి ఇంకా ఏమీ తెలియదు. సీనియర్ నాయకులు ఏది చెబితే అది చేస్తానన్నారు.
#WATCH | Famous singer Anuradha Paudwal joins the Bharatiya Janata Party in Delhi
On being asked if she will contest the Lok Sabha elections, she says, "I don't know yet, whatever suggestion they give me…" pic.twitter.com/91DCDia7Ca
— ANI (@ANI) March 16, 2024
జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగినప్పుడు అనురాధ అక్కడ భజన పాడారు. గతంలో పలు కార్యక్రమాల్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ వేదికపై అనురాధ పౌడ్వాల్‌ను ప్రశంసించారు. అనురాధకు 1969లో అరుణ్ పౌడ్వాల్‌తో వివాహమైంది. SD బర్మన్ సహాయకులుగా, స్వరకర్తగా పనిచేశారు. అనురాధ భర్త 1991లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరికి కుమారుడు ఆదిత్య, కూతురు కవిత ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…