AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinese Spy Ship: చైనా గూఢాచారి నౌకకు విశాఖ సముద్ర తీరంలో ఏం పని..?

భారత రాడార్‌లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి నౌక ఏమి చేస్తోంది? అన్నదానిపై దృష్టి సారించింది.

Chinese Spy Ship: చైనా గూఢాచారి నౌకకు విశాఖ సముద్ర తీరంలో ఏం పని..?
Chinese Spy Ship
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Mar 16, 2024 | 2:53 PM

Share

భారత రాడార్‌లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి నౌక ఏమి చేస్తోంది? అన్నదానిపై దృష్టి సారించింది. అదీ మన అగ్ని 5 క్షిపణి పరీక్షకు కొన్ని రోజుల ముందు, బంగాళాఖాతం సమీపంలో రెండవ చైనా గూఢచారి నౌకను గుర్తించడం హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కదలికలను తెలుసుకోవాలన్న చైనా దురుద్దేశాన్ని తీవ్రతరం చేసినట్టు భారత్ భావిస్తోంది.

రెండు వారాల క్రితం, చైనీస్ పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3 మాల్దీవుల ప్రభుత్వం ఆహ్వానం పేరుతో ఆపరేషనల్ టర్నరౌండ్ కోసం మేల్ పోర్ట్‌లో పోర్ట్ కాల్ చేసింది. దీనిపైనా ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయి. మన తీరానికి అనుకుని తరచూ పర్యటిస్తూ ఉండడం పై ప్రస్తుతం మన నిఘా వర్గాలు దృష్టి సారించాయి.

అగ్ని-5 క్షిపణి సామర్థ్యాన్ని పసిగట్టేందుకేనా..?

మల్టీపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ – ఎంఐఆర్‌వి సాంకేతికతతో సగర్వంగా భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా తయారు చేసి తొలి ప్రయోగ పరీక్షను సైతం విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష నిర్దిష్ట వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో అగ్ని-V ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) లేదా K-4 జలాంతర్గామి-లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి (SLBM) పరీక్షలను కలిగి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అగ్ని-V, 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. ఇది భారతదేశం ప్రధాన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) తో కలిపి వ్యూహాత్మక నిరోధక సామర్థ్ద్యాన్ని కలిగి ఉన్న కీలకమైన క్షిపణి. ప్రత్యేకంగా జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి అణు-సామర్థ్యం గల క్షిపణిగా ఇది రూపొందించడం జరిగింది. ఇది భారతదేశానికి కీలకమైన సముద్ర-ఆధారిత వ్యూహాత్మక సామర్థ్యాన్ని అందిస్తుంది.

ప్రొటోకాల్స్ ప్రకారమే…

బంగాళాఖాతం – హిందూ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతాలలో భారతదేశం మామూలుగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ భద్రతా ప్రోటోకాల్‌లకు ఈ ప్రయోగాలు కట్టుబడి ఉంటాయి కూడా. ఈ పరీక్షలకు ముందు, సంబంధిత అధికారులు, ఎయిర్‌మెన్ మరియు సముద్ర వినియోగదారులకు NOTAMల ద్వారా సమాచారం కూడా ఇస్తారు. భారతదేశం క్షిపణి ఆయుధాగారం కార్యాచరణ సంసిద్ధతను, సాంకేతిక అధునాతనతను ధృవీకరించడంలో ఈ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి.

చైనా గూఢాచార నౌకకు సంబంధించి నైన్ డాష్ లైన్ పుస్తక రచయిత, సముద్ర భద్రతా విశ్లేషకుడు కూడా అయిన పూజా భట్ వివరిస్తూ… హిందూ మహాసముద్రంలో చైనా గూఢచారి నౌకల ఉనికి నిత్యకృత్యంగా మారిందన్నారు. భారత క్షిపణి పరీక్షల సమయంలో ఇటువంటి సంఘటనలు చాలా సాధారణం అనీ వివరించారు.

భారతదేశం ఇటీవల క్షిపణి పరీక్షను సూచిస్తూ IOR మీదుగా విస్తరించి ఉన్న గణనీయమైన నో-ఫ్లై జోన్ కోసం NOTAM జారీ చేసింది. ఈ నౌకలు క్షిపణి పరీక్షను పర్యవేక్షిస్తున్నట్లు చాలా సంభావ్యంగా ఉందనీ ఆమె వివరించారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక క్షిపణి పని తీరు, సామర్థ్యాన్ని అంచనా వేయడానికే ఈ చైనా గూఢాచార నౌక వచ్చినట్టు గుర్తించిన భారత సైన్యం ఆమేరకు అంతర్జాతీయ భద్రతా మండలిలో ఫిర్యాదు చేసేందుకు అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

భారత్ నో ఫ్లై జోన్ లోనూ చైనా నౌకలు

అదే సమయంలో రెండు వారాల క్రితం జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే చైనా నౌక భారతదేశ తూర్పు సముద్రతీరంలో గుర్తించడం జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెల రోజుల పాటు ఆ నౌక సర్వే కొనసాగిస్తునట్టు సమాచారం. అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. భారతదేశం బంగాళాఖాతంపై విమాన పరిమితి జోన్‌ను ప్రకటించినప్పుడు, విమానాల రాకపోకలపై నిర్దిష్ట ప్రాంతంలో ఆంక్షలు విధించిన సమయంలో కూడా చైనా ఓడ కదలికలు ఉండడం పై భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.

భారతదేశం నో ఫ్లై జోన్ విధించడానికి, NOTAM నోటీస్ ప్రకటనకు ముందే హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు చైనా గూఢచారి నౌకల కదలికను ట్రాక్ చేసింది. NOTAM అనేది విమాన కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని కలిగి ఉన్న నోటీసు, ప్రమాదాలు, రాబోయే ప్రతికూల పరిస్థితులు లేదా భద్రతను ప్రభావితం చేసే మార్పుల గురించి వివరాలను అందిస్తుంది.

మార్చి 7న, భారతదేశం బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని చుట్టుముట్టే గణనీయమైన ప్రాంతంలో నో-ఫ్లై జోన్‌ను వివరిస్తూ NOTAM జారీ చేసింది. మార్చి 11 నుండి అమల్లోకి ఇది వచ్చింది ఈ NOTAM 3,550 కిలోమీటర్ల విస్తీర్ణంలో నియంత్రిత గగనతలాన్ని నిర్దేశిస్తుంది. ఇది ఒడిశా సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి APJ నుండి ఉద్భవించే క్షిపణి పరీక్ష యొక్క సంభావ్యతను సూచిస్తుంది. విశ్లేషణ ప్రకారం, జియాంగ్ యాంగ్ హాంగ్ 01 సముద్ర మార్గం NOTAMలో పేర్కొన్న ప్రాంతాన్ని దాటుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…