Jaipur: రక్తమోడుతున్నా.. పరీక్షలు రాసిన విద్యార్ధులు.! తీవ్రగాయాలతో పరీక్ష.

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్ధులు పరీక్ష రాసేందుకు వెళ్తూ యాక్సిడెంట్‌కు గురయ్యారు. అయినా లెక్కచేయకుండా పరీక్ష కేంద్రానికి చేరుకుని రక్తమోడుతున్నా పరీక్షలు రాసి అందరితో శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

Jaipur: రక్తమోడుతున్నా.. పరీక్షలు రాసిన విద్యార్ధులు.! తీవ్రగాయాలతో పరీక్ష.

|

Updated on: Mar 16, 2024 | 3:33 PM

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్ధులు పరీక్ష రాసేందుకు వెళ్తూ యాక్సిడెంట్‌కు గురయ్యారు. అయినా లెక్కచేయకుండా పరీక్ష కేంద్రానికి చేరుకుని రక్తమోడుతున్నా పరీక్షలు రాసి అందరితో శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఉదయం 7: 45 గంటలకు బైక్‌పై బయలుదేరారు. అయితే సెంటర్‌కు చేరుకునేలోగా వారి బైక్‌ను ‍ప్రయాణికుల వ్యాన్‌ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష హాలులో ఉన్న ఉపాధ్యాయులకు తమ పరిస్థితి వివరించి ఎగ్జామ్‌ రాసేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అనుమతిచ్చారు. ఆనందంతో పరీక్ష పేపర్‌ తీసుకొని విద్యార్ధులు పరీక్ష రాసారు. విద్యార్ధులు వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా పరీక్షపైనే ఫోకస్‌ చేసి ఎగ్జామ్‌ కంప్లీట్‌ చేశారు. చదువు, కెరీర్‌పై వారికున్న డెడికేషన్‌కు తోటి విద్యార్ధులు, ఉపాధ్యాయులు అంతా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్ధులను అభినందించారు. ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్‌పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us