AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో భారీ పేలుడు…

గుజరాత్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బరోచ్ జిల్లా దహేజ్‌లో జరిగిన ఈ పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. కెమికల్ ఫ్యాక్టరీ కావటంతో మంటల కంటే ఎక్కువగా పొగ వ్యాపించింది. ఆ పొగను పీల్చిన 15 మంది అస్వస్థతకు గురైయ్యారు. నల్లటి పొగ ఆకాశాన్ని తాకిందా అన్నట్లు వాతవరణం మారిపోయింది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘోఘా బీచ్‌ వరకు ఈ నల్లటి పొగ కనిపించింది. […]

గుజరాత్‌లో భారీ పేలుడు...
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 4:00 PM

Share

గుజరాత్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బరోచ్ జిల్లా దహేజ్‌లో జరిగిన ఈ పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. కెమికల్ ఫ్యాక్టరీ కావటంతో మంటల కంటే ఎక్కువగా పొగ వ్యాపించింది. ఆ పొగను పీల్చిన 15 మంది అస్వస్థతకు గురైయ్యారు. నల్లటి పొగ ఆకాశాన్ని తాకిందా అన్నట్లు వాతవరణం మారిపోయింది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘోఘా బీచ్‌ వరకు ఈ నల్లటి పొగ కనిపించింది.

ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో సమీపంలోని గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అసలే కెమికల్‌ ఫ్యాక్టరీ విషవాయువులు ఏమన్నా వ్యాపిస్తాయేమోనని ఆందోళన కనిపించింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.