BJP: పాక్ వక్రబుద్ధిపై బీజేపీ ఫైర్.. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు..

పాకిస్థాన్‌ వక్రబుద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ న్యూయార్క్‌లో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

BJP: పాక్ వక్రబుద్ధిపై బీజేపీ ఫైర్.. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు..
Pm Modi Bilawal Bhutto
Follow us

|

Updated on: Dec 17, 2022 | 8:55 AM

BJP’s nationwide protest: పాకిస్థాన్‌ వక్రబుద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ న్యూయార్క్‌లో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అధికార బీజేపీ సైతం పాక్ వ్యాఖ్యలపై మండిపడింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ దగ్గర శుక్రవారం భారీ నిరసన చేపట్టింది. శనివారం దేశవ్యాప్తంగా నిరసనలను నిర్వహించాలని బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది. పాక్ “సిగ్గుమాలిన” వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు శనివారం దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పాకిస్థాన్ మంత్రి ప్రకటన అత్యంత నీచమైనది, సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. పాకిస్తానీ విదేశాంగ మంత్రి వ్యాఖ్య అత్యంత అవమానకరమైనదిగా ఉందని.. పిరికితనంతో ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతుందని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని బిజెపి ఒక ప్రకటనలో పేర్కొంది.

భుట్టో ప్రకటన ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, అన్యాయం, అరాచకం, పాక్ సైన్యంలో చెలరేగుతున్న విభేదాలు, క్షీణిస్తున్న ప్రపంచ సంబంధాలు, పాకిస్తాన్ తీవ్రవాదులకు ప్రధాన ఆశ్రయంగా మారిన వాస్తవం దృక్పథం నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడం లక్ష్యంగా చేస్తున్న పిరికిపంద చర్యని బీజేపీ పేర్కొంది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు నిర్వహిస్తామని తెలిపింది. బీజేపీ కార్యకర్తలు పాకిస్థాన్‌, ఆదేశ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి వారి సిగ్గుమాలిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తారని బీజేపీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా.. యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ వేదికగా ఈ ఉగ్రవాదం ఇంకెన్నాళ్లంటూ పాకిస్తాన్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు.. ఇది మీ మంత్రిని అడగండంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని పాక్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఒక బిన్‌ లాడెన్‌ చనిపోయాడు.. కానీ ఇంకో బిన్‌ లాడెన్‌, గుజరాత్‌ కసాయి ఇంకా బతికే ఉన్నాడంటూ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో పీఎం నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్.. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిందేమో!. భారత్‌లో ఇప్పుడున్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాంగమంత్రి అంటూ ప్రధాని మోదీ, జైశంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు.. ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్‌.. బిన్‌ లాడెన్‌కి ఆశ్రయమిచ్చింది.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది.. ప్రపంచానికి తెలుసంటూ.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. పాక్ పై విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని.. జైశంకర్‌ తూర్పారపట్టడంతో తట్టుకోలేక భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదనికి దారితీసింది.

కాగా.. పాక్‌ విదేశాంగ మంత్రి చేసిన ఈ కామెంట్స్‌పై భారత్‌ తీవ్రంగా రియాక్టైంది. పాకిస్తాన్‌ మరోసారి నీచస్థితిని బయటపెట్టుకుందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. అనాగరికంగా వ్యవహరిస్తున్న పాక్.. హద్దు దాటితే చర్యలు తప్పవంటూ భారత్ వార్నింగ్‌ ఇచ్చింది. వేరే వారికి చెప్పేముందు.. ఆదేశం తమ నీచ స్థితిని గుర్తించుకోవడం మంచిదంటూ సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..