ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఫైర్.. ఎందుకంటే ?

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు కక్కారు. కరోనా వ్యాధికి గురై మృతి చెందినవారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు..

ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఫైర్.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 6:33 PM

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు కక్కారు. కరోనా వ్యాధికి గురై మృతి చెందినవారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నగరంలో కరోనా కేసులు 6,542 నమోదు కాగా.. 73 మంది రోగులు మరణించారు. అయితే వీరి సంఖ్య 300 పైగానే ఉందని. కేజ్రీవాల్ సర్కార్ కావాలనే ఈ సంఖ్యను దాచిపెట్టి తక్కువగా చూపుతోందని ఆయన ఆరోపించారు. దీన్ని నిరూపిస్తానంటూ.. ఢిల్లీ లోని నిగమ్ బోధ్ ఘాట్, పంజాబీ బాగ్, ఐ టీ ఓ విద్యుత్ దహనవాటికల వద్ద రోజుకు ఎన్ని డెడ్ బాడీస్  చేరుతున్నాయో, వారి బంధువులు ఎన్నేసి గంటలు వేచి ఉండవలసి వస్తోందో లెక్కలతో సహా వివరించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.