కమలదళంపై లాఠీచార్జ్.. 60 మందికి గాయాలు.. 37 మంది అరెస్ట్..

కమలదళంపై లాఠీచార్జ్ జరిగింది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన 37 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వెస్ట్ బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టింది బీజేపీ. అయితే అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు బుధవారంనాడు పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు బయలుదేరారు. అయితే […]

  • Updated On - 6:10 am, Thu, 14 November 19 Edited By:
కమలదళంపై లాఠీచార్జ్.. 60 మందికి గాయాలు.. 37 మంది అరెస్ట్..


కమలదళంపై లాఠీచార్జ్ జరిగింది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన 37 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వెస్ట్ బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టింది బీజేపీ. అయితే అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు బుధవారంనాడు పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు బయలుదేరారు. అయితే ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగించారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేసి.. 37 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు చేసిన ఈ లాఠీచార్జ్‌లో దాదాపు 60 మంది బీజేపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. బీజేపీ యువమోర్చా ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీష్ ఘోష్ నాయకత్వం వహించారు.

గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమస్యలపై పోరాడుతుంటే.. పట్టించుకోవడం లేదని.. ఇప్పటి వరకు డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిందేమీలేదంటూ మండిపడ్డారు. మరోవైపు ఆందోళనకారులు కేఎంసీ భవంతిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో పాటు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులపై తాము శాంతియుత నిరసన చేపడుతుంటే.. పోలీసులు మాత్రం తమపై లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. అంతేకాదు తాము నిరసన తెలిపేందుకు ముందస్తు అనుమతి కూడా తీసుకున్నామని.. అయినప్పటికీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.