బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కి బలవంతపు క్వారంటైన్ ‘శిక్ష’ !

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ని బలవంతంగా 14 రోజుల హోమ్ క్వారంటైన్ కి తరలించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఝార్ఖండ్ లో ప్రవేశించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు..

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కి బలవంతపు క్వారంటైన్ 'శిక్ష' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2020 | 8:11 PM

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ని బలవంతంగా 14 రోజుల హోమ్ క్వారంటైన్ కి తరలించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఝార్ఖండ్ లో ప్రవేశించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు అధికారులు. యూపీకి చెందిన సాక్షి మహరాజ్.. రాంచీకి 200 కి.మీ.దూరంలోని గిరిధ్ లో అడుగుపెట్టారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉండగా మధ్యలోనే ఆయనను ఆపివేసి బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు. రాష్ట్రం బయటి నుంచి వచ్ఛే వ్యక్తులను తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కి పంపాలన్న నిబంధనలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఆయన కోరితే దీని నుంచి  మినహాయింపును కోరవచ్చునని అధికారులు చెప్పారు.

Latest Articles