నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించండి

తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలంటూ లోక్‌సభ సాక్షిగా బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ ప్రగ్యా ఠాగూర్ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో పెద్ద దుమారమే చెలరేగగా.. విపక్షాలు ఖండించాయి. ఈ క్రమంలో సాధ్వీ వ్యాఖ్యలపై బీజేపీ కూడా మండిపడింది. ప్రగ్యా వ్యాఖ్యాలను ఖండించిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. ఆమెను రక్షణశాఖపై ఏర్పాటు […]

నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించండి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 29, 2019 | 3:38 PM

తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలంటూ లోక్‌సభ సాక్షిగా బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ ప్రగ్యా ఠాగూర్ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో పెద్ద దుమారమే చెలరేగగా.. విపక్షాలు ఖండించాయి. ఈ క్రమంలో సాధ్వీ వ్యాఖ్యలపై బీజేపీ కూడా మండిపడింది. ప్రగ్యా వ్యాఖ్యాలను ఖండించిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. ఆమెను రక్షణశాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ విడత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు కూడా ఆమెను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. కాగా లోక్‌సభ సమావేశాల్లోనే కాదు.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ గాడ్సే నిజమైన దేశభక్తుండంటూ ఆమె వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.