వెడ్డింగ్ ఇన్విటేషన్ తో గ్రీన్ ఛాలెంజ్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నివారణ పై యుద్ధం నడుస్తోంది. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గానూ పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని చోట్ల ప్లాస్టిక్ కు బదులుగా కోడి గుడ్లు పంపిణీ చేస్తే, మరికొన్ని చోట్ల సన్నబియ్యం అందిస్తున్నారు. మరికొంతమంది యువతీ యువకులు విభిన్నంగా ఆలోచిస్తూ..ప్లాస్టిక్ రహిత పెళ్లిళ్లు, పుట్టిన రోజులు సైతం నిర్వహిస్తున్నారు. ఇలా ఓ వైపు ప్లాస్టిక్ వాడకంపై సమరం సాగిస్తూనే..మరో వైపు గ్రీన్ ఛాలెంజ్ దిశగా అడుగులు […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నివారణ పై యుద్ధం నడుస్తోంది. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గానూ పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని చోట్ల ప్లాస్టిక్ కు బదులుగా కోడి గుడ్లు పంపిణీ చేస్తే, మరికొన్ని చోట్ల సన్నబియ్యం అందిస్తున్నారు. మరికొంతమంది యువతీ యువకులు విభిన్నంగా ఆలోచిస్తూ..ప్లాస్టిక్ రహిత పెళ్లిళ్లు, పుట్టిన రోజులు సైతం నిర్వహిస్తున్నారు. ఇలా ఓ వైపు ప్లాస్టిక్ వాడకంపై సమరం సాగిస్తూనే..మరో వైపు గ్రీన్ ఛాలెంజ్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు.
మొక్కల పెంపకంతో పర్యావరణాన్నిఏ విధంగా కాపాడుకోవాలో తోటి వారికి వివరిస్తున్నారు. మొన్నామధ్య మెదక్ జిల్లాలో ఓ దంపతులు తమ కూతురి వివాహంలో విత్తనాలతో వివాహా ఆహ్వాన పత్రికలు తయారు చేయించి బంధుమిత్రులకు అందజేశారు. శుభలేఖతో పాటుగానే అటు మొక్కల పెంపకంపై కూడా ప్రజలకు స్పూర్తినందించారు. అచ్చం అదే ట్రేండును ఫాలో అయ్యారు భోపాల్ లోని కుటుంబీకులు.
భోపాల్ లోని ఓ కుటుంబం పెళ్లి కార్డులను పూల మొక్కల రూపంలో అందరికి అందజేశారు. పర్యావరణ హితంగా ఉండేలా పెళ్లి కార్డులను తయారు చేయించారు. ఎందుకంటే పెళ్లి తర్వాత అందరూ ఆ కార్డులను వృద్దాగా పాడేస్తారు. అందుకే వారు ఇలా విభిన్నంగా ఆలోచించారు. పెళ్లి ఎంత పవిత్రమైనదో, పెళ్లి కార్డు కూడా అంతే పవిత్రమైనది వారు చెబుతున్నారు. అటువంటి పెళ్లి శుభలేఖలు ఇలా అందమైన పూల మొక్కల రూపంలో నలుగురికి ఉపయోగపడలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. ఆ పెళ్లి కార్డులను చూసిన బంధువులు, సన్నిహితులు సైతం వారిని ఎంతగానో అభినందించారు. ఇలా కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ..అందరూ మొక్కలు పెంచేందుకు ముందుకు వస్తున్నారు