TV9 WTTF 2025: ముందు భారత్‌ను సందర్శించండి.. TV9 చొరవను ప్రశంసించిన ఎంపీ మహేష్ శర్మ..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 'వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్' ఘనంగా ప్రారంభమైంది.. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతున్న టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ను బీజేపీ ఎంపీ మహేష్ శర్మ ప్రశంసించారు. విభిన్న సంస్కృతులు, ఎన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో, ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు.

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది.. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతున్న టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ను బీజేపీ ఎంపీ మహేష్ శర్మ ప్రశంసించారు. విభిన్న సంస్కృతులు, ఎన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో, ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవన్నారు. దీనికి తాను TV9 కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ శర్మ టీవీ9 ప్రత్యేక కార్యక్రమం ‘వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్’లో మొదటి రోజు పాల్గొన్నారు. టీవీ9 ఈ చొరవ ప్రయాణం, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మహేష్ శర్మ వివరించారు. విభిన్న సంస్కృతులు.. అందాలు ఉన్న దేశంలో.. ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని.. అందరూ ప్రపంచాన్ని సందర్శించే ముందు.. భారతదేశంలోని ప్రముఖ నగరాలను సందర్శించాలని సూచించారు.
ప్రధాని మోదీ దేశ పర్యాటక రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ఎంపీ మహేష్ శర్మ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆలోచన, దృఢ సంకల్పం ఫలితంగానే నేడు లక్షద్వీప్ మాల్దీవులను దాటేసిందన్నారు. తాను 70 కి పైగా దేశాలను సందర్శించాను.. కానీ ప్రపంచాన్ని పర్యటించే ముందు భారతదేశం మొత్తాన్ని పర్యటించడం ముఖ్యమన్నారు.. ప్రధాని మోదీ కూడా ఇదే చెబుతున్నారంటూ పేర్కొన్నారు.

TV9 Network’s World Travel & Tourism Festival 2025
ఈ చొరవకు TV9 కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..
దేశ జిడిపిలో 6.8 శాతం పర్యాటక రంగం నుంచే వస్తుందని నోయిడా గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ మహేష్ శర్మ.. వివరించారు. నేడు, భారతదేశం ప్రయాణ – పర్యాటక సూచికలో 30 పాయింట్లను అధిగమించిందని పేర్కొన్నారు. ఇది గతంలో 40 పాయింట్లు వెనుకబడి ఉందన్నారు. పెద్ద పని చేయాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని.. దీని ఫలితంగా తాజ్ పర్యాటకం మారిపోయిందన్నారు.. ట్రావెల్ & టూరిజం రంగాలను ప్రోత్సహించేలా చేస్తున్న TV9 కి చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. శుక్రవారం నుంచి (ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16) ఆదివారం వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వేదికగా టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ జరగనుంది. దేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9, రెడ్ హ్యాట్ కమ్యూనికేషన్స్‌తో కలిసి వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో దేశంలోని ప్రసిద్ధ పాప్ గాయకుడు పాపోన్ లైవ్ ప్రోగ్రాం.. పలు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..