Rajasthan: ఎమ్మెల్యేలకు ఐఫోన్-13 గిఫ్ట్ ఇచ్చిన రాజస్థాన్ సర్కార్.. బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే

రాజస్థాన్ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 200 మంది ఎమ్మెల్యేలకు గెహ్లాట్ ప్రభుత్వం ఐఫోన్ 13ను బహుమతిగా అందజేసింది.

Rajasthan: ఎమ్మెల్యేలకు ఐఫోన్-13 గిఫ్ట్ ఇచ్చిన రాజస్థాన్ సర్కార్.. బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే
Rajasthan
Follow us

|

Updated on: Feb 24, 2022 | 9:34 AM

Rajasthan govt. gift iphone 13: రాజస్థాన్ శాసనసభ(Rajasthan Assembly)లో ఫిబ్రవరి 23 బుధవారం రాష్ట్ర బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 200 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ప్రభుత్వం ఐఫోన్ 13ను బహుమతిగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే ఎమ్మెల్యేలకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలకు ఐప్యాడ్‌లు అందజేశారు. రూ.2 కోట్ల వరకు మొత్తం ఖర్చు సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, శాసనసభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ కాపీని అందజేయడం అనవాయితీ. అయితే ఈసారి రాజస్థాన్ ప్రభుత్వం ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఖరీదైన బహుమతిని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ తప్పుబడుతోంది.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీలోని ఏ శాసనసభ్యులు కూడా పార్టీని వీడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బహుమతి ప్రకటించిందని ప్రతిపక్ష . ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వయంగా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై కన్నేశారు. అందుకే బడ్జెట్‌లో సామాన్యులకు కరెంటు రేట్ల తగ్గింపు, సబ్సిడీ వంటి అనేక రాయితీలను ముఖ్యమంత్రి కల్పించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని 200 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఐఫోన్ 13ను బహుమతిగా ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.

అయితే, బడ్జెట సమావేశాల అనంతరం బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ కాపీని శాసనసభ్యులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి బ్రీఫ్‌కేస్ నాణ్యత చాలా మెరుగ్గా ఉంది. అది లెదర్ బ్యాగ్. బడ్జెట్ కాపీని చూసేందుకు శాసనసభ్యులు చేతులు దులుపుకుంటే, లోపల ఐఫోన్ 13, ఛార్జింగ్ అడాప్టర్, కవర్ దర్శనమిచ్చాయి. ఇది చూసి ఎమ్మెల్యేలంతా ఆశ్చర్యపోయారు. బహుమతిగా ఇచ్చిన iPhone 13 ధర రూ. 75,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్లు సమాచారం.

రాజస్థాన్ ప్రభుత్వ ఈ నిర్ణయంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తోంది. గెహ్లాట్ సర్కార్ నిర్ణయం పట్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా మాట్లాడుతూ.. ‘పార్టీ ఎమ్మెల్యేలు ఈ బహుమతిని తిరిగి ఇస్తానన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గులాబ్ కటారియా, పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యేలంతా ఐఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ వ్యయంపై భారం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే, బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. యువత కోసం ఒక ప్రకటన చేస్తూ, వచ్చే సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో లక్ష ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నట్లు గెహ్లాట్ చెప్పారు. ఇంట్లో కూర్చున్న 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం అమలు చేస్తామన్నారు. బడ్జెట్‌లో CISF తరహాలో RISF ఏర్పాటును ప్రకటించారు. దీని కింద 2000 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. రికో వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వీరికి విధులు అప్పగిస్తామన్నారు.

Read Also… BJP Chalo Amalapuram: రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా చెల్లించండి.. నేడు బీజేపీ ఛలో అమలాపురం..