యూపీలో బీజేపీ ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి.. బురద జల్లి, నల్లసిరా పూసిన స్థానికులు

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతలు ఏదో ఒక సందర్బంలో బీజేపీ నేతలపైనా... వారు ప్రయాణిస్తున్న వాహనాలపైనా దాడులు చేస్తున్నారు.

యూపీలో బీజేపీ ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి.. బురద జల్లి, నల్లసిరా పూసిన స్థానికులు
Bjp Mla Car Attacked
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 9:58 AM

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతలు ఏదో ఒక సందర్బంలో బీజేపీ నేతలపైనా… వారు ప్రయాణిస్తున్న వాహనాలపైనా దాడులు చేస్తున్నారు. యూపీలోని ముజఫర్ నగర్ లో ఉమేష్ మాలిక్ అనే బీజేపీ ఎమ్మెల్యే నిన్న ఇలా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కొందరు రైతులు, స్థానికులు ఆయన ప్రయాణిసస్తున్న వాహనంపై బురద జల్లి … బ్లాక్ పెయింట్ పూశారు. రాళ్లతో ఆ వాహనం అద్దాలు పగులగొట్టారు.రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ స్వగ్రామమైన సిసౌలీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఈ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించిన వీరు రైతు చట్టాలకు నిరసనగా నినాదాలు చేస్తూ..వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ వీరి దాడిని ఆపలేకపోయారు. కొందరు పోలీసుల దుస్తులపైనా నల్ల సిరా పడింది.రాకేష్ తికాయత్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఉమేష్ మాలిక్ ఆరోపించగా.. తికాయత్ సోదరుడు నరేష్ తికాయత్ దీన్ని ఖండించారు. నిజానికి ముజఫర్ నగర్ లోని బుధానా నియోజకవర్గం నుంచి ఉమేష్ మాలిక్ లోగడ ఎన్నికయ్యారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కాగా- తన సొంత నియోజకవర్గంలోనే ఈ ఎమ్మెల్యేకి ఇలా చుక్కెదురైంది. ఈ గుంపు నుంచి ఆయనను రక్షించడానికి పోలీసులు నానా పాట్లు పడాల్సివచ్చింది. ఇరుకైన సందుల్లో ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లలేకపోవడంతో రైతులు, స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. చివరకు పోలీసుల సాయంతో ఉమేష్ బయటపడ్డారు. స్థానిక బీజేపీ నేతలు బుధానా పోలీసు స్టేషన్ చేరుకొని స్థానికులపై ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ కూడా పోలీసులతో మాట్లాడారు.

మరిన్ని ఇక్కడ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో వింత చేపల కలకలం.. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న వింత చేపలు.. వీడియో

Pakistan: కోట్ల నగదుతో వ్యాన్ డ్రైవర్ పరారీ..! తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన.. వీడియో