CM Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై బీజేపీ నేతల ఫిర్యాదులు..పోలీసు కేసుల నమోదు

కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణేను అరెస్టు చేయించినందుకు ప్రతీకారంగా బీజేపీ నేతలు కూడా శివసేనపై మండిపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను ప్రధానంగా వీరు టార్గెట్ చేశారు. థాక్రే తో సహా ఆయన భార్య, సామ్నా పత్రిక ఎడిటర్ రష్మీ థాక్రే పైన..

CM Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై బీజేపీ నేతల ఫిర్యాదులు..పోలీసు కేసుల నమోదు
Bjp Complaints On Maharashtra Cm Uddhav Thackeray

Edited By:

Updated on: Aug 26, 2021 | 10:21 AM

కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణేను అరెస్టు చేయించినందుకు ప్రతీకారంగా బీజేపీ నేతలు కూడా శివసేనపై మండిపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను ప్రధానంగా వీరు టార్గెట్ చేశారు. థాక్రే తో సహా ఆయన భార్య, సామ్నా పత్రిక ఎడిటర్ రష్మీ థాక్రే పైన, శివసేన యువజన విభాగం నేత సర్ దేశాయ్ పైన ఈ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమకు ఈ మేరకు కంప్లయింట్లు అందిన మాట నిజమేనని, ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేశామని నాసిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 24 న సర్ దేశాయ్.. రాణే నివాసం వద్ద అక్రమంగా నిరసన ప్రదర్శన చేశారని, ఆ తరువాత ఆయనను ముఖ్యమంత్రి థాక్రే తన అధికారిక నివాసంలో సత్కరించారని నాసిక్ బీజేపీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను వివిధ చానళ్లు ప్రసారం చేశాయని, ఫేస్ బుక్ లో కూడా వాటిని రిలీజ్ చేశారని వారన్నారు. సైబర్ చట్టాల కింద కేసులు పెట్టాలని తాము ఖాకీలను కోరామన్నారు.

కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఉద్ధవ్ థాక్రే లోగడ చేసిన వ్యాఖ్యలను వీరు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తనను యోగి అని చెప్పుకుంటారని, అలాంటప్పుడు ఆయన వెళ్లి గుహల్లో కూర్చోవాలని, ఆయనను చెప్పుతో కొట్టాలని థాక్రే వ్యాఖ్యానించారని వీరన్నారు. ఆదిత్యనాథ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కాక. గోరఖ్ పూర్ మఠ మహంత్ కూడా అని వీరు గుర్తు చేశారు. అందువల్ల థాక్రే కామెంట్స్, హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్టేనన్నారు. అటు-నారాయణ్ రాణేను ఉద్దేశించి సామ్నా పత్రికలో అనుచిత పదాలు వాడారన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.