Watch Video: ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం..సెలబ్రేషన్స్‎ను అలా ప్లాన్ చేసిన ఈ పార్టీ నేతలు..

లోక్‌ సభ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్దమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎవరి ఏర్పాట్లలో వాళ్లు తలమునకలై ఉన్నారు. అటు సీఈసీ కౌంటింగ్ నిర్వహించడంపై వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Watch Video: ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం..సెలబ్రేషన్స్‎ను అలా ప్లాన్ చేసిన ఈ పార్టీ నేతలు..
Wining Celebrations
Follow us
Srikar T

|

Updated on: Jun 03, 2024 | 6:56 PM

లోక్‌ సభ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్దమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎవరి ఏర్పాట్లలో వాళ్లు తలమునకలై ఉన్నారు. అటు సీఈసీ కౌంటింగ్ నిర్వహించడంపై వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో విజయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ర్యాలీలు, బాణాసంచాపేలుళ్లకు అనుమతి నిరాకరించింది కేంద్ర ఎన్నికల కమిషన్. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచడానికి రెడీ అవుతున్నారు. ముంబైలో ప్రత్యేకంగా బూందీ లడ్డూను తయారు చేయిస్తున్నారు. ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న డబ్బాలో లడ్డూలను సిద్దం చేస్తున్నారు.

బిహార్‌ రాజధాని పాట్నాలో కూడా భారీ ఎత్తన విజయోత్సవాలకు బీజేపీ కార్యకర్తలు సిద్దమవుతున్నారు. వేలాది లడ్డూలను తయారు చేస్తున్నారు. రేపు వెలువడే ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమని, ప్రధాని మోదీ హ్యాట్రిక్‌ కొడతారని వాళ్లంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌లో పోటాపోటీగా అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ , ఇటు బీజేపీ కార్యకర్తలు వేడుకలకు సిద్దమవుతున్నారు. పలు స్వీటు షాపుల్లో రెండు పార్టీల సింబల్స్‌తో స్వీట్లను తయారు చేయిస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కొన్ని బీజేపీకి అనుకూలంగా, టీఎంసీకి అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల గుర్తులతో, రంగులతో ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి మరీ మిఠాయిలు తయారు చేయిస్తున్నారు నాయకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..