Bizarre Incident: ‘నేను దుర్గామాతని, నాభర్తను వదిలేయండి’.. పోలీసులకు చుక్కలు చూపించింది భయ్యా..!

|

Jul 09, 2022 | 12:36 PM

Bizarre Incident: భర్తలో సగం భార్య అంటారు. భర్తకు ఆపద వస్తే.. భార్య ముందుకు వస్తుందని చాలాసార్లు వినే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా..

Bizarre Incident: ‘నేను దుర్గామాతని, నాభర్తను వదిలేయండి’.. పోలీసులకు చుక్కలు చూపించింది భయ్యా..!
Woman
Follow us on

Bizarre Incident: భర్తలో సగం భార్య అంటారు. భర్తకు ఆపద వస్తే.. భార్య ముందుకు వస్తుందని చాలాసార్లు వినే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా చూసే ఛాన్స్ వచ్చింది. మద్యం కేసులో అరెస్ట్ అయిన తన భర్తను విడిపించేందుకు ఆ భార్య ఏకంగా కాళీ అవతారమెత్తింది. పోలీసులను చుక్కలు చూపించింది. తాను దుర్గామాతను అని, తన భర్తను విడిచిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసింది. ఓ చేతిలో బియ్యం, మరో చేతిలో ఒక రకమైన కర్రను పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచమహువా ముసహరిలో మద్యం సేవించి హల్ చల్ చేసిన కార్తీక్ మాంఝీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కార్తీక్ భార్య సంజు దేవీ తన భర్తను విడిపించుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అయితే, ఆమె వచ్చిన తీరు ఇప్పుడు సెన్షేషన్‌గా మారింది. ఓ చేతిలో బియ్యం, మరో చేతిలో కర్రతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. తాను దుర్గామాతను అంటూ ఊగిపోయింది. రకరకాల జిమ్మిక్కులు చేసింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో, పోలీసు అధికారులపై బియ్యం చల్లుతూ డ్రామా చేయడం ప్రారంభించింది. తన భర్తను వెంటనే వదిలేయాలని, లేకపోతే అందరూ బాధపడతారు అంటూ హెచ్చరించింది.

కాసేపటి తరువాత పోలీసులు.. సంజూదేవితోపాటు ఆమెతో పాటు వచ్చిన మహిళలను పోలీస్‌స్టేషన్‌ ఆవరణ నుంచి బయటకు పంపించేశారు. అంతకు ముందు.. సంజూ దేవిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు మాట్లాడగా.. అది విన్న సంజూ దేవి తన డ్రామాను ఆపేసింది. చివరకు పోలీసులు పంపించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..