AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠశాలలోనే పడక గది..! మహిళా టీచర్‌తో హెడ్‌ మాస్టర్‌.. వీడియో రికార్డ్‌!

బిహార్‌లోని వైశాలి జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనతో పాటు పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాల ప్రయోగశాలలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోనే గది ఏర్పాటు చేసుకుని వారు కాపురం పెట్టారని తెలిసింది.

పాఠశాలలోనే పడక గది..! మహిళా టీచర్‌తో హెడ్‌ మాస్టర్‌.. వీడియో రికార్డ్‌!
Representative Image
SN Pasha
|

Updated on: Jun 01, 2025 | 3:36 PM

Share

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు, పాఠశాలలోనే పడక గడి ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు ఉన్నారనే ఇంకితం కూడా లేకుండా స్కూల్‌లోనే కాపురం పెట్టారు. బిహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో వైశాలిలోని మహువాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అతను ఓ మహిళా టీచర్‌తో అసభ్యకర స్థితిలో ఉన్న సీసీటీవీ వీడియో బయటపడింది. పాఠశాల ప్రయోగశాల లోపల మంచిగా ఒక మంచం ఏర్పాటు చేసుకొని.. ఇద్దరు సిగ్గులేకుండా కాపురం పెట్టారు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. దీనితో పాటు, అతనిపై శాఖాపరమైన విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, ప్రధానోపాధ్యాయుడితో పాటు మహిళా ఉపాధ్యాయురాలిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైశాలి ప్రోగ్రామ్ ఆఫీసర్ హర్పూర్ మీర్జానగర్ హయ్యర్ సెకండరీ స్కూల్ యాక్టింగ్ హెడ్‌మాస్టర్ హేమంత్ కుమార్‌ను తన పదవి నుండి సస్పెండ్ చేశారు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలితో అతని ప్రవర్తనకు సంబంధించి ఈ-శిక్ష కోష్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆధారాలతో సహా పోర్టల్‌లోని అధికారికి ఫిర్యాదు అందింది.

దీని తరువాత వెంటనే, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ విషయంపై చర్య తీసుకొని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మహువా బ్లాక్ విద్యాశాఖాధికారిని ఆదేశించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అర్చన కుమారి ఈ విషయాన్ని పరిశీలించడానికి పాఠశాలకు చేరుకుని ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు, పాఠశాలలోని ఉపాధ్యాయులు ఏం చెప్పలేదు. పాఠశాల వాచ్‌మెన్‌ను ప్రశ్నించినప్పుడు, అతను ప్రయోగశాల తాళాలు తన వద్ద లేవని చెప్పాడు. ప్రయోగశాల తాళాలు ప్రధానోపాధ్యాయుడి వద్దే ఉన్నాయి. ప్రయోగశాల తాళాలను తీసుకొని పరిశీలించగా, దాని లోపల ఒక మంచం కనిపించింది. అంటే పాఠశాల లోపల ఒక బెడ్‌రూమ్ ఏర్పాటు చేసుకొని, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..