AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-ట్రక్కు ఢీ.. 8మంది మృతి.. ఐదుగురికి సీరియస్!

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటో- ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-ట్రక్కు ఢీ.. 8మంది మృతి.. ఐదుగురికి సీరియస్!
Truck Auto Collision In Patna
Balaraju Goud
|

Updated on: Aug 23, 2025 | 9:50 AM

Share

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటో భారీ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాలోని షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆప్రాంతం భీకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు.

షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దనియావాన్ హిల్సా రాష్ట్ర రహదారిపై శనివారం(ఆగస్టు 23) ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఆటో ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులుచెబుతున్నారు. మృతులందరూ ఒక ఆటోలో ప్రయాణిస్తున్నారు. నలంద జిల్లాలోని హిల్సా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న రేరా మలామా గ్రామ నివాసితులు గంగానదిలో పుణ్యస్నానం అచరించడానికి ఒక ఆటోలో పాట్నాకు వచ్చారు. అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రయాణీకులతో నిండిన ఆటో చేరుకున్నప్పుడు, అది నేరుగా ట్రక్కును ఎదురెదురుగా ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఆటో, ట్రక్కు ఢీకొన్న ఘట్టంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న శబ్దం చాలా బిగ్గరగా ఉండటంతో చుట్టుపక్కల ప్రజలు ప్రమాద స్థలం వైపు పరుగులు తీశారు. ఇంతలో, ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు.

ఈ సంఘటన గురించి స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే, డానియావన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!