బిగ్ ట్విస్ట్.. మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో కీలక మలుపు
పూణేలో డెలివరీ బాయ్ మహిళపై అత్యాచారం చేశాడన్న కేసు కీలక మలుపు తిరిగింది. డెలివరీ బాయ్ అత్యాచారం చేయలేదని పోలీసులు తేల్చారు. మహిళ అబద్ధం చెప్పిందని గుర్తించారు. ఆమెను విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ చెప్పింది విని అంతా అవాక్కయ్యారు.

కొన్ని ఘటనల్లో ముందు ఒకటి అనుకుంటే.. పోలీసుల విచారణలో మరోటి తేలుతుంది. చివరకు అసలు విషయం తెలిశాక షాకవుతాం. గతంలో మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులోనూ ఇలాగే జరిగింది. తొలుత జంట మిస్సింగ్ అనుకోగా.. తర్వాత భర్త శవమై కనిపించాడు. చివరకు భార్యే భర్తను హత్య చేయించిందని తెలిసి అంతా నివ్వెరపోయారు. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. పూణేలో ఇటీవల మహిళపై డెలివరీ బాయ్ రేప్ చేశాడన్న ఘటన సంచలనంగా మారింది. దీంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అత్యాచారం చేసింది డెలివరీ బాయ్ కాదని తేలింది. మహిళ ఫ్రెండే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేలడంతో అంతా అవాక్కయ్యారు. పైగా మహిళే డెలివరీ బాయ్ అని అబద్ధం చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మహిళను విచారించగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూణేలోని తన ఇంట్లో డెలివరీ బాయ్ తనను అత్యాచారం చేశాడని ఓ మహిళ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓటీపీ పేరుతో డెలివరీ బాయ్ ఇంట్లోకి ప్రవేశించి తనపై స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని పోలీసులకు చెప్పింది. అంతేకాకుండా సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానంటూ రాశాడని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు 10 టీమ్స్‌తో నిందితుడి కోసం గాలించారు. అయితే విచారణలో అసలు విషయం తెలియడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. దీంతో సదరు మహిళను విచారిస్తే మరిన్ని కీలక విషయాలను వెల్లడించింది.
మహిళను అత్యాచారం చేసింది తన ఫ్రెండేనని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ ఎప్పటినుంచో పరిచయం ఉందని.. గతంలో ఎన్నో సార్లు కలుసుకున్నారని గుర్తించారు. ‘‘ఆ రోజు నేను లైంగిక సంబంధానికి సిద్ధంగా లేను. కానీ నా ఫ్రెండ్ నన్ను బలవంతం చేశాడు. అతడిపై కోపంతోనే డెలివరీ అత్యాచారం చేశానని ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ పోలీసుల విచారణలో తెలిపింది. అంతేకాకుండా ఆ మహిళే సెల్ఫీ తీసుకుని.. నిందితుడి మాదిరి మళ్లీ వస్తానంటూ వార్నింగ్ కోట్ రాసిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..