Terrorist Sajjad Afghani Killed: కశ్మీర్ లోయల్‌లో ఇండియన్ ఆర్మీకి అతిపెద్ద విజయం.. భయంకర ఉగ్రవాది హతం..
Terrorist Sajjad Afghani Killed: కశ్మీర్ లోయల్‌లో ఇండియన్ ఆర్మీకి, జమ్మూకశ్మీర్ పోలీసులకు అతిపెద్ద విజయం లభించింది.
Terrorist Sajjad Afghani Killed: కశ్మీర్ లోయల్‌లో ఇండియన్ ఆర్మీకి, జమ్మూకశ్మీర్ పోలీసులకు అతిపెద్ద విజయం లభించింది. కరుడుగట్టిన, భయంకరమైన ఉగ్రవాది, జైష్ ఇ మొహ్మద్ టెర్రరిస్ట్ సజ్జాద్ అఫ్ఘని ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోఫియాన్‌లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు.. సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా బలగాలు.. వారిపై కాల్పులు జరిపాయి. అయితే ఉగ్రవాదులు కూడా ప్రతిగా కాల్పులు జరుపడంతో అక్కర భీకర యుద్ధ వాతావరం ఏర్పడింది.
మొత్తంగా మూడు రోజులుగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక టెర్రరెస్ట్ సజ్జాద్ అఫ్ఘని సహా ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ను భద్రతా దళాలు ధృవీకరించాయి. ఈ ఘటన భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని చెప్పాలి. కాగా, ఉగ్రవాదుల నుంచి ఎం-4 రైఫిళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉంటే కొద్ది రోజుల క్రితం కశ్మీర్‌లోని సోపోర్‌లోనూ కీలక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోపోర్‌లో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు హతమార్చాయి.
Also read:
మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ అందుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్… మాస్ మాహారాజా సరసన ఫరియా..
‘రైతులు పేదవారవుతుంటే ప్రభుత్వ అధికారులు ధనవంతులవుతున్నారు’, మేఘాలయ గవర్నర్ వ్యాఖ్య