My India My LiFE Goals: పర్యావరణమే ఫస్ట్.. మిగతావన్నీ లాస్ట్.. బిచి భాయ్ దినచర్య ఏంటో తెలుసా..?

|

Aug 07, 2023 | 9:00 PM

Bichi Bhai inspirational story: పర్యావరణమే ఫస్ట్.. మిగతావన్నీ లాస్ట్.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు.. పర్యావరణ పరిరక్షణ.. మూగ జంతువుల రక్షణకు పాటుపడే వారు సమాజంలో చాలామంది కనిపిస్తారు.. అలాంటి వారు.. ఎప్పుడూ ప్రత్యేకమే.. ఎల్లప్పుడూ ఆదర్శనీయమే.. ఎందుకంటే.. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. పర్యావరణం.. మూగ జంతువుల రక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులకు టీవీ9 సలాం చేస్తోంది..

My India My LiFE Goals: పర్యావరణమే ఫస్ట్.. మిగతావన్నీ లాస్ట్.. బిచి భాయ్ దినచర్య ఏంటో తెలుసా..?
Bichi Bhai Inspirational Story
Follow us on

Bichi Bhai inspirational story: పర్యావరణమే ఫస్ట్.. మిగతావన్నీ లాస్ట్.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు.. పర్యావరణ పరిరక్షణ.. మూగ జంతువుల రక్షణకు పాటుపడే వారు సమాజంలో చాలామంది కనిపిస్తారు.. అలాంటి వారు.. ఎప్పుడూ ప్రత్యేకమే.. ఎల్లప్పుడూ ఆదర్శనీయమే.. ఎందుకంటే.. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. పర్యావరణం.. మూగ జంతువుల రక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులకు టీవీ9 సలాం చేస్తోంది.. అభినందిస్తోంది. ఈ ప్రపంచంలో ఉన్న ఇలాంటి వ్యక్తులలో బిచీ భాయ్ ఒకరు.. బిచి భాయ్ కృషి వల్ల తాబేళ్ల మరణాలు గణనీయంగా తగ్గాయి.. తాబేళ్ల సంరక్షణలో పడి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదంటే.. ఆయన అంకితభావం ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు.. ఒడిశాలో నివసిస్తున్న 37 ఏళ్ల బిచిత్రానంద్ బిస్వాల్ చాలా సాదాసీదా వ్యక్తి.. కానీ ఇప్పుడు అతన్ని బిచి భాయ్ అంటూ అందరూ అభిమానిస్తారు.. బిచ్చి భాయ్ కారణంగా, అతని గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒడిశాలోని గుండాలబా అనే చిన్న గ్రామం చుట్టూ సముద్రం, చుట్టూ మడ అడవులు ఉన్నాయి. అయితే, బిచిత్రానంద్ బిస్వాల్ కు ప్రకృతి కోసం ఏదన్నా చేయాలనే ఆలోచన చిన్నప్పుడే వచ్చింది.. అప్పటినుంచి ఆయన తాబేళ్ల సంరక్షణకు పాటుపడుతున్నారు.

ఎనిమిదో తరగతిలోనే ఆలోచన..

బిచ్చి భాయ్ 27 ఏళ్లకు పైగా సముద్ర ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 1996లో తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సముద్ర తీరంలో విహరించేందుకు సాయంత్రం 4 గంటలకు తరచూ వచ్చేవాడినని.. తన తొలి ప్రయాణం గురించి చెప్పారు. పెద్దసంఖ్యలో తాబేళ్లు చనిపోతున్నట్లు చూసి.. వాటిని ఎలా కాపాడుకోవాలో, ఎలా సంరక్షించాలో ఎప్పుడూ ఆలోచించేవాడినని తెలిపారు.. ఈ జీవులు సముద్రంలో నివసించడం చాలా ముఖ్యమని, దాని గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకుని.. తాబేళ్ల సంరక్షణకు నడుంబిగించినట్లు తెలిపారు.

ఆ ఆలోచన నాటినుంచి ఈ తాబేళ్లను కాపాడేందుకు ప్రచారం ప్రారంభించామని బిచ్చి భాయ్ పేర్కొన్నారు. తాబేళ్ల రక్షణ గురించి ప్రజలకు చెప్పాం. తాబేలు గుడ్డు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లినప్పుడు గుడ్డును తీసుకొచ్చి గూడులో భద్రంగా ఉంచుతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి చేసుకోకుండా..

తాబేళ్ల గుడ్లను సంరక్షించడానికి బిచి భాయ్ ఒక గూడును తయారు చేశారు. ఆయన గుడ్లను సేకరించి అక్కడ ఉంచుతారు. ఇలా ప్రతి 95 రోజులకు ఒక తాబేలు పిల్ల గుడ్డు నుంచి బయటకు వస్తుంది. పిల్ల తాబేళ్లు బయటకు రాగానే వాటిని లెక్కించి సముద్రంలో వదిలేస్తారు. ఇలా జీవితమంతా సముద్రానికి అంకితమిచ్చానని బిచి భాయ్ పేర్కొన్నారు. తాబేలు సంరక్షణలో బిజీగా ఉండడం వల్ల పెళ్లి చేసుకోవడం మర్చిపోయాను. వన్యప్రాణుల సంరక్షణకే నా జీవితాన్ని అంకితం చేశాను. సముద్ర జీవులను రక్షించడమే తన ధ్యేయమని బిచి భాయ్ చెప్పారు. తన ప్రచారంలో చాలా మంది యువకులను కూడా చేర్చుకుని.. తాబేళ్లను సంరక్షిస్తున్నట్లు వివరించారు. 27 సంవత్సరాల తన ప్రచారంలో లక్షలాది తాబేళ్లను రక్షించానని.. ఈ ప్రచారం నేటికీ కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..