Viral: కారును ఆపిన పోలీసులు.. లోపల అంతా నార్మల్.. అనుమానంతో గ్యాస్ ట్యాంక్ చెక్ చేయగా మైండ్ బ్లాంక్

ఇందు గలదు.. అందు లేదు అని సందేహం వలదు. ఇప్పుడు పోలీసులు ఎందెందు వెతికినా అదే కనిపిస్తుంది.. పూర్తి వివరాలు తెలులుసుకుందాం పదండి.

Viral: కారును ఆపిన పోలీసులు.. లోపల అంతా నార్మల్.. అనుమానంతో గ్యాస్ ట్యాంక్ చెక్ చేయగా మైండ్ బ్లాంక్
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2022 | 6:42 PM

కాప్స్ ఎంత అలెర్ట్‌గా ఉంటున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. ఎజెన్సీలో గంజాయి సాగు ఇంకా సాగుతూనే ఉందడానికి ఆధారాలు దొరకుతున్నాయి. ఎందుకంటే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. ఆ లింక్స్ ఏజెన్సీకే ముడిపడి ఉంటున్నాయి. పోలీసుల వేట అధికంగా ఉండటంతో స్మగ్లర్స్ మత్తును రవాణా చేసేందుకు కొత్త.. కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. పోలీసులే విస్తుపోయేలా క్రియేటివిటీ చూపిస్తున్నారు కేటుగాళ్లు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కంటే ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. జైల్లో పెట్టినా బయటకి వచ్చాక ‘తగ్గేదే లే’ అంటూ అదే దందా కొనసాగిస్తున్నారు. తాజాగా జగదల్‌పూర్‌(Jagdalpur) నుంచి భోపాల్(Bhopal)కు కారులో అక్రమంగా తరలిస్తున్న 23.3 కిలోల గంజాయిని  క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు దిమ్మతిరిగే ప్లానింగ్ చేశారు. కారులోని గ్యాస్ ట్యాంక్‌లో గంజాయి ప్యాకెట్లను దాచి ఉంచారు. అయినా సరే.. వారి పాచికలు పారలేదు. అడ్డంగా దొరికిపోయారు. సుమారు రూ.2 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారి కారుని సీజ్ చేసి… ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను దేవాస్‌లోని కన్నోడ్ నివాసి నరేంద్ర సిసోడియా (32), షాజాపూర్‌లోని షుజల్‌పూర్ నివాసి మాన్‌సింగ్ మేవాడా (42)గా గుర్తించారు.

నిందితుడు చాలా కాలంగా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తూ షాజాపూర్‌, విదిశా, దేవాస్‌ ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి… రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పెడ్లర్లు, స్మగ్లర్లపై క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిందని అదనపు డీసీపీ (క్రైమ్ బ్రాంచ్) శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. ఇలాంటి పనులు చేసేవారి గురించి తమకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జాతీయ వార్తల కోసం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!