AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhojpuri Actor Arrested: ఇటు కార్ల చోరీ.. అటు నకిలీ నోట్ల చలామణి.. పోలీసులకు దొరికిపోయిన నటుడు, నిర్మాత..!

Bhojpuri Actor Arrested: కార్ల దొంగతనాలకు పాల్పడుతన్న భోజ్‌పురి నటుడితో పాటు అతనికి సహాకరిస్తున్న ఒక నిర్మాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరు కలిసి కార్లను చోరీ చేయడమే..

Bhojpuri Actor Arrested: ఇటు కార్ల చోరీ.. అటు నకిలీ నోట్ల చలామణి.. పోలీసులకు దొరికిపోయిన నటుడు, నిర్మాత..!
Bhojpuri Actor Arrested In Delhi For Fake Currency Racket
Follow us
Subhash Goud

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 18, 2021 | 3:19 PM

Bhojpuri Actor Arrested: ఖరీదైన కార్ల దొంగతనాలకు పాల్పడుతన్న భోజ్‌పురి నటుడితో పాటు అతనికి సహాకరిస్తున్న ఒక నిర్మాతను ఢిల్లీ పోలీసులు అరెఅదుపులోకి తీసుకున్నారు. వారివద్దనుంచి వద్ద నుంచి 50 లక్షల రూపాయల నకిలీ నోట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిలో కొన్ని పిల్లలు ఆడుకునే  నోట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా యాంటీ థెఫ్ట్‌ స్వ్కాడ్‌కు వీరి గురించి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాటువేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు రాజాసింగ్  ఉరఫ్‌ ( మహ్మద్)‌, సయ్యద్‌ జైన్‌ ఉరఫ్ (హుస్సేన్‌లు)గా గుర్తించారు. ఈ  ఇద్దరు నిందితులను ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ మార్కెట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే  నిందితుల నుంచి ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్‌ డీసీపీ ఆర్పీ మీనా మాట్లాడుతూ… రాజ్‌ షాహిద్‌లు భోజ్‌పురి చిత్రాలలో నటించారని, “అలహాబాద్‌ టూ ఇస్లామాబాద్”‌ అనే సినిమాను కూడా తీశారని తెలిపారు. అలాగే ‘సాహిల్‌ సన్నీ’ అనే ప్రొడక్షన్‌ హౌస్‌ కూడా నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో కార్ల చోరీకి అలవాటు పడినట్లు తెలిపారు. ప్రస్తుతం అదుపులో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి : జ్యోతిరాధిత్య సింధియా ప్యాలస్ లో దొంగలు పడ్డారు, ఏమేం పోయాయో మరి ? మొదలైన పోలీసుల దర్యాప్తు

విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరోయిన్.. సేమ్ టూ సేమ్ బ్లాక్ వాటర్.. లీటర్ రేట్ ఎంతో తెలుసా.