ఢిల్లీలో మరో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపిన యువకుడు.. పీకలు కోసి..
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు.. తన కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు. ఈ మర్డర్ మిస్టరీ దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Delhi Family Murder: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు.. తన కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు. ఈ మర్డర్ మిస్టరీ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన తండ్రిసహా కుటుంబంలోని ఆడవాళ్ళందరినీ కొడుకు మర్డర్ చేశాడు. ఢిల్లీలోని పాలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నట్టింట్లో రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలను చూసి.. స్థానికులు హడలిపోయారు. తండ్రి, అమ్మమ్మ, ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హతమార్చాడు ఆ యువకుడు. సొంత కుటుంబసభ్యులందరినీ అత్యంత దారుణంగా గొంతు కోసి, నరికిచంపడం స్థానికంగా కలకలం రేపుతోంది.
బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్ ప్రాంతానికి చెందిన యువకుడు.. తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కేశవ్ (25) గా గుర్తించారు. అతను ఒక డ్రగ్ అడిక్ట్.. అని ఇటీవలనే మాదకద్రవ్యాల పునరావాస కేంద్రం నుంచి తిరిగి వచ్చాడని పేర్కొంటున్నారు. కుటుంబసభ్యులతో గొడవపడి నిందితుడు కేశవ్ తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మలను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
మృతిచెందిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి ఉండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు డగ్స్‌కు బానిసగా మారాడని చెప్పారు. అయితే హత్యలకు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతులను అతని అమ్మమ్మ దీవానా దేవి (75), అతని తండ్రి దినేష్ (50), తల్లి దర్శన, సోదరి ఊర్వశి (18)గా గుర్తించారు. హత్యల అనంతరం నిందితుడు తప్పించుకునే ప్లాన్ వేశాడని.. అతని బంధువులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..