Azadi ka Amrit Mahotsav: భారతదేశ చరిత్రలో రాజీవ్ గాంధీ సంచలన నిర్ణయం.. 1989లో విప్లవాత్మక నిర్ణయం ఏమిటో తెలుసా..!
అమృత మహోత్సవంలో భాగంగా టీవీ 9 1947 సంవత్సరం నుండి 2022 వరకు భారతదేశం జర్నీనిని పాఠకులకు పరిచయం చేస్తోంది. దీనిలో భారతదేశం ఏ సంవత్సరంలో ఎలాంటి చారిత్రక అడుగులు వేసిందో తెలియజేస్తున్నాం.
Azadi ka Amrit Mahotsav: భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్ల పూర్తి కానున్న సందర్భంగా ఈ ఏడాది ఆజాద్ కా అమృత మహోత్సవంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా భారత దేశం ప్రతి సంవత్సరం సాధించిన చారిత్రక పని గురించి తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత దేశం.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి.. నేటి వరకు భారతదేశ ప్రజలు వివిధ రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దేశానికి 1989 సంవత్సరం చాలా ముఖ్యమైనది . ఓటు వేసే వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నికల్లో యువత భాగస్వామ్యం పెరిగింది. భారత రాజ్యాంగంలోని 61వ సవరణ తర్వాత 1989లో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. అందుకే ఓటు హక్కు పరంగా ఈ ఏడాది యువతకు ఎంతో ప్రత్యేకతగా నిలిచింది.
అమృత మహోత్సవంలో భాగంగా టీవీ 9 1947 సంవత్సరం నుండి 2022 వరకు భారతదేశం జర్నీనిని పాఠకులకు పరిచయం చేస్తోంది. దీనిలో భారతదేశం ఏ సంవత్సరంలో ఎలాంటి చారిత్రక అడుగులు వేసిందో తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో.. ఈరోజు విషయం 1989 సంవత్సరానికి సంబంధించిన విప్లవాత్మక మార్పులు తెలుసుకుందాం..
రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. తన హయాంలో ఆయన తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాలు చర్చనీయాంశంగా నిలిచాయి. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించడం. ఈ ఓటు హక్కు కోసం.. రాజ్యాంగ సవరణ చేశారు. 1988లో బిల్లు ఆమోదించబడింది. దీంతో ఎన్నికల్లో ఓటు వేసే వయస్సును 21 నుండి 18కి తగ్గించారు. ఈ కొత్త నిబంధన 28 మార్చి 1989 నుండి అమల్లోకి వచ్చింది. ఓటు నమోదు వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించబడింది.
దేశంలో 5 కోట్ల మంది యువ ఓటర్లు: రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత దేశంలో 5 కోట్ల మంది యువత ఓటర్లు పెరిగారు. అయితే ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. దేశంలో ఇంత పెద్ద మార్పు వచ్చినప్పుడు వ్యతిరేకత మొదలైంది. అయితే రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, నిర్మాణానికి యువత పాత్ర అత్యంత ముఖ్యమైనదని నమ్మారు.
రాజీవ్ గాంధీ యువ నాయకులను తయారు చేస్తుందని భావించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో రాజీవ్ గాంధీ ఆలోచన ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వెలువడలేదు.ఓటర్ల వయస్సును తగ్గించి.. ఓట్ల సంఖ్య పెంచినా.. ఎన్నికలా ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా వెలువడలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలో లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..