Ayodhya: అయోధ్య రామాలయంలో పర్సును పోగొట్టుకున్న వృద్ధురాలు.. ఆ తర్వాత మ్యాజిక్ జరిగింది..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం.. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం ఇప్పుడు ఓ విషయంపై చర్య జరుగుతోంది. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట సమయంలో ఓ వృద్ధురాలి పర్సు పోయింది. ఆ పర్సు  నిండా నోట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ ఫ్యామిలీ పోలీసులకు కంప్లంట్ ఇచ్చి తమ స్వగ్రామానికి చేరుకుంది. ఇప్పుడు ఆ పర్సు దొరకడమే కాదు.. సొంత దారుల వద్దకు చేరుకుంది కూడా.. వివరాల్లోకి వెళ్తే..

Ayodhya: అయోధ్య రామాలయంలో పర్సును పోగొట్టుకున్న వృద్ధురాలు.. ఆ తర్వాత మ్యాజిక్ జరిగింది..
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2024 | 11:48 AM

దేవుడు అనేది ఒక నమ్మకం.. నమ్మినవారిని ఎల్లవేళలా కాచికాపాడతాడు అనే విశ్వాసంతో మానవులు జీవిస్తారు. దైవాన్ని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తమ జీవితంలో ఏమి జరిగినా అది దైవానుగ్రహము అని నమ్మేవారు ఎందరో ఉన్నారు. తాజాగా అయోధ్యలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం దేవుడి లీల అని అంటూ చక్కర్లు కొడుతోంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం.. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం ఇప్పుడు ఓ విషయంపై చర్య జరుగుతోంది. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట సమయంలో ఓ వృద్ధురాలి పర్సు పోయింది. ఆ పర్సు  నిండా నోట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ ఫ్యామిలీ పోలీసులకు కంప్లంట్ ఇచ్చి తమ స్వగ్రామానికి చేరుకుంది. ఇప్పుడు ఆ పర్సు దొరకడమే కాదు.. సొంత దారుల వద్దకు చేరుకుంది కూడా.. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త  బిలియనీర్ శ్రీధర్ వెంబు కుటుంబం జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారు. అతని తల్లి జానకి (80)తో కలిసి ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్యకు చేరుకున్నారు. 80 ఏళ్ల వృద్ధురాలు జానకి ఆలయానికి వెళ్లిన సమయంలో పర్సు పోగొట్టుకుంది. ఈ పర్సులో రూ.63550 నగదు, ఆధార్ కార్డుతో సహా పలు వస్తువులు ఉన్నాయి. పర్సు పోగొట్టుకోవడంతో జానకి ఆందోళనకు గురైంది. సెక్యూరిటీ సహాయంతో బాల రామయ్యను కనులారా వీక్షించి దర్శనం చేసుకుంది. తన పర్సును తిరిగి తన దగ్గరకు చేర్చమని మనసులో బాల రామయ్యని  ప్రార్ధించింది.

అయోధ్యకు 680 కిలోమీటర్ల దూరంలో దొరికిన పర్సు

శ్రీధర్ వెంబు పోలీసులకు తల్లి పర్సు విషయం ఫిర్యాదు చేసి తిరిగి తమిళనాడు లోని తంజావూరుకు సమీపంలోని తెన్‌కాశికి చేరుకున్నాడు. అయితే జానకి పోగొట్టుకున్న పర్సు అయోధ్యకు 680 కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్‌లో ఒక సన్యాసి వద్ద కనుగొనబడింది. సాధువు సుధ ప్రేమానంద్ మహరాజ్ కూడా రామ్ లల్లా  పవిత్రోత్సవానికి వచ్చారు. వృద్ధురాలి పర్సు అతని బ్యాగ్‌లో పడింది. తన సంచిలో ఉన్న పర్సుని గుర్తించిన సాధువు అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులను సంప్రదించారు.

పర్సులో ఉన్న  ఆధార్ కార్డు, పూజ సామాగ్రి, నగదు రూ.66,290 ను తిరిగి తీసుకోవాలని శ్రీధర్ కు అధికారుల సూచించారు. దీంతో బుధవారం రామాలయానికి వచ్చిన ఎస్‌ నివాస్‌కు ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఇన్‌ఛార్జ్‌ యశ్వంత్‌సింగ్‌ పర్సు ఇచ్చారు. పర్సులో ఉన్న చిన్న గంట తన తల్లి జానకికి చాలా ప్రత్యేకం అని ఇది నిత్యం పూజలో ఉపయోగిస్తారని .. పోయిన పర్సు  తిరిగి పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన తల్లి పర్సును సురక్షితంగా అందజేసిన తరువాత రామమందిరం వద్ద సిఎం యోగి  ఏర్పాటు చేసిన భద్రతపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..