PM Modi-Ayodhya: అయోధ్యలో అణువణువూ రాముడే.. ఒక్కసారైనా దర్శించుకోవాలంటూ ప్రధాని పిలుపు..

|

Oct 23, 2022 | 10:27 PM

దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని సందర్శించుకున్నారు ప్రధాని మోదీ. వేల కోట్లతో శ్రీరామ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని,

PM Modi-Ayodhya: అయోధ్యలో అణువణువూ రాముడే.. ఒక్కసారైనా దర్శించుకోవాలంటూ ప్రధాని పిలుపు..
Ayodhya Deepotsav
Follow us on

దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని సందర్శించుకున్నారు ప్రధాని మోదీ. వేల కోట్లతో శ్రీరామ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో దీపోత్సవ్‌ కార్యక్రమానికి విచ్చేశారు మోదీ. శ్రీరామ పట్టాభిషేకాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు మోదీ. సరయూ నదికి ప్రత్యేక హారతి ఇచ్చారు మోదీ. దీపోత్సవ్‌ సందర్భంగా అయోధ్యలో 18 లక్షల దివ్వెలను వెలిగించారు. సరయూ నది తీరం దివ్వెలతో వెలిపోతోంది.

అయోధ్యలో అణువణువూ రాముడే..

శ్రీరాముడి ఆశీస్సులతో తాను అయోధ్యను దర్శించుకున్నట్టు తెలిపారు మోదీ. అయోధ్యలో ఎక్కడ చూసినా అణువణువూ రాముడే కన్పిస్తాడని అన్నారు. 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మోదీ. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజూ ఎంతో దూరంలో లేదని, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తారని అన్నారు. అయోధ్యకు వచ్చే వారి సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఎక్కడైతే రాముడు ప్రతి అణువులో ఉంటాడో అక్కడి ప్రజలు అందరికి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. రాముడి అందరివాడని, అయోధ్యకు వచ్చే ప్రతి భక్తుడికి ఇక్కడి వారు స్వాగతం పలకాలని అన్నారు ప్రధాని.

ఇవి కూడా చదవండి

కాగా, అంతకుముందు శ్రీరామ్‌ లాలాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర నిర్మాణపు పనులను సమీక్షించారు. వేగంగా ఆలయ నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక రామ్‌లీలా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామాయణం థీమ్‌గా లేజర్‌షో అందరిని ఆకట్టుకుంది. రామ్‌లీలా కోసం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు హెలికాప్టర్‌లో విచ్చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హారుతులిచ్చి వాళ్లకు స్వాగతం పలికారు. అనంతరం సీతారామ లక్ష్మణ బృందాన్ని ఆసీనులు గావించి ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..