డ్రీమ్ 11 ఆడి రూ.కోటీ జాక్ పాట్ గెలుచుకున్న ఆటో డ్రైవర్

| Edited By: Narender Vaitla

Apr 09, 2023 | 8:41 PM

డ్రీమ్ 11 ఆడి ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కటీశ్వరుడైపోయాడు. తన వద్ద ఉన్న కేవలం రూ.39 పెట్టుబడి పెట్టి కోటి రూపాయల వరకు సంపాందించాడు. వివరాల్లోకి వెళ్తే బిహార్ లోని పూర్ణియా జిల్లా మజ్ గామా పంచాయతీ పరిధిలో నౌషద్ అన్సారీ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

డ్రీమ్ 11 ఆడి రూ.కోటీ జాక్ పాట్ గెలుచుకున్న ఆటో డ్రైవర్
Naushad Ansari
Follow us on

డ్రీమ్ 11 ఆడి ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. తన వద్ద ఉన్న కేవలం రూ.39 పెట్టుబడి పెట్టి కోటి రూపాయల వరకు సంపాందించాడు. వివరాల్లోకి వెళ్తే బిహార్ లోని పూర్ణియా జిల్లా మజ్ గామా పంచాయతీ పరిధిలో నౌషద్ అన్సారీ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.అతినకి ఓ ఆటో ఉంది. రోజు ఆటో నడుపుకునే నౌషద్ కు రోజుకు సుమారు రూ.400 వరకు మాత్రమే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే అసలు అతనికి బ్యాంకు ఖాతా కూడా లేదు. అయితే గత బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ఏకంగా కోటీ రూపాయలు గెలుచుకున్నాడు.

అయితే బుధవారం జరిగిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ఇతడు జట్టు కూర్పు చేశాడు. అతను రూపొందించిన టీం డ్రీమ్ 11 అందరికంటే ఎక్కువ పాయింట్లు రావడంతో రూ.కోటీ రివార్డు లభించింది. 2021 నుంచి ఇలా డ్రీమ్ 11లో ఆడుతూ నౌషద్ ఇప్పటివరకు 45 జట్లు కూర్పు చేశాడు. చివరికి ఇప్పుడు రూ.కోటి గెలిచాకా స్థానిక బ్యాంకులో ఖాతా తెరిచాడు. డ్రీమ్ 11 వ్యాలెట్ లో ఉన్న డబ్బును తన ఖాతాలోకి బదిలీ చెసుకున్నాడు. అయితే పన్నులతో కొంత డబ్బు పోగా..రూ.70 లక్షలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

Note: ఈ కథనం ప్రేక్షకుల ఆసక్తి కోసం మాత్రమే ప్రచూరించబడింది. డ్రీమ్ 11 లాంటి ఆన్ లైన్ గేమ్ లను ఆడటాన్ని టీవీ9 ప్రోత్సహించదు. జూదం ఆడడం ఎప్పటికైనా అనర్థాలకే దారి తీస్తుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని గమనించగలరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం