మా వ్యాక్సిన్ తో రోగుల రక్తం గడ్డ కట్టిన కేసు ఈ దేశంలో ఒక్కటైనా లేదు. ఆస్ట్రా జెనికా సంస్థ క్లారిటీ

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా నాణ్యతపై పలు దేశాల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ టీకామందు తీసుకున్న కొంతమంది రోగుల్లో రక్తం గడ్డ కట్టిన (బ్లడ్ క్లాటింగ్) కేసులు బయటపడ్డాయని వార్తలు వచ్చాయి.

మా వ్యాక్సిన్ తో రోగుల రక్తం గడ్డ కట్టిన కేసు ఈ దేశంలో ఒక్కటైనా లేదు. ఆస్ట్రా జెనికా సంస్థ క్లారిటీ
astrazeneca vaccine
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 13, 2021 | 12:59 PM

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా నాణ్యతపై పలు దేశాల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ టీకామందు తీసుకున్న కొంతమంది రోగుల్లో రక్తం గడ్డ కట్టిన (బ్లడ్ క్లాటింగ్) కేసులు బయటపడ్డాయని వార్తలు వచ్చాయి. కానీ ఇండియాలో ఈ విధమైన కేసు ఒక్కటి కూడా లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ వెల్లడించింది. ఏది ఏమైనా దీని ప్రభావం, నాణ్యతలపై తాము వచ్చేవారం సమీక్షిస్తామని అధికారులు తెలిపారు. డెన్మార్క్, నార్వే, ఇటలీ సహా ఆరు దేశాలు ఆస్ట్రాజెనికా వినియోగాన్ని నిషేధించాయి. దీంతో దీనివల్ల కలిగే దుష్పరిణామాలపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ ఈ దేశాలు ఇంకా అనుమానాలను వెలిబుచ్చుతూనే ఉన్నాయి.

నిజానికి మన దేశంలో ఆస్ట్రాజెనికా టీకామందు తీసుకున్న ఏ ఒక్క రోగి కూడా తన సైడ్ ఎఫెక్ట్ గురించి వెల్లడించలేదని కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కమిటీ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా.ఎన్.కె.అరోరా తెలిపారు. అయినా డేటాను కూలంకషంగా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. దర్యాప్తునకుగాను దేశ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన డేటా, ఇతర వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందజేయనుందని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ సంస్థకు చెందిన రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులతో నిన్న ఈ శాఖ సమావేశం నిర్వహించిందని, ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనుందని ఆయన అన్నారు.

ఇలా ఉండగా తమ దేశంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది రోగుల్లో రక్తం గడ్డ కట్టినట్ట్టు ఫిర్యాదులు అందాయని డెన్మార్క్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అందువల్ల ప్రస్తుతానికి దీన్ని తాత్కాలికంగా బ్యాన్ చేశామన్నారు. కానీ ఈ టీకామందుకు, రక్తం గడ్డ కట్టడానికి  ఏమైనా సంబంధం ఉందా అన్న విషయం నిర్ధారణ కావలసి ఉందన్నారు.ఇక యూరోపియన్ యూనియన్ మెడికల్ ఏజన్సీ కూడా ఈ వ్యాక్సిన్ ని సమర్థించింది. ఆస్ట్రియాలో దీన్ని వాడినప్పుడు ఒక నర్సు మరణానికి, ఇదే కారణమని నిర్ధారణ కాలేదని నిరూపితమైందని ఈ సంస్థ పేర్కొంది. ఈ నెల 9 వరకు యూరప్ దేశాల్లో సుమారు 30 లక్షలమంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నా వీరిలో 22 మంది మాత్రమే తమ రక్తం గడ్డ కట్టినట్టు ఫిర్యాదు చేశారని ఈ సంస్థ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Scary Video: రాకాసి పిడుగు దెబ్బ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు.. ఒళ్లుగగురు పరిచే వీడియో.!

కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకు సహయపడతాయా ? అసలు విషయాలెంటో తెలుసుకొండిలా..

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే