AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సాం…నిప్పులు చిమ్ముతున్న చమురు బావి.. మరో మూడు వారాల పాటు మంటలు

అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ చమురుబావిలో రేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. మరో మూడు వారాల పాటు ఈ మంటలు ఇలాగే మండే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సుమారు రెండు వారాలకు పైగా ఈ బావి నుంచి గ్యాస్ తో కూడిన మంటలు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని మీటర్ల ఎత్తు వరకు దట్టమైన నల్లని పొగలు కమ్ముతూ.. దిబ్రు-సైఖోనా నేషనల్ పార్క్ వద్ద బయో డైవర్సిటీకి పెను ముప్పును కలిగిస్తున్నాయి. ఇద్దరు […]

అస్సాం...నిప్పులు చిమ్ముతున్న చమురు బావి.. మరో మూడు వారాల పాటు మంటలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 2:52 PM

Share

అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ చమురుబావిలో రేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. మరో మూడు వారాల పాటు ఈ మంటలు ఇలాగే మండే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సుమారు రెండు వారాలకు పైగా ఈ బావి నుంచి గ్యాస్ తో కూడిన మంటలు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని మీటర్ల ఎత్తు వరకు దట్టమైన నల్లని పొగలు కమ్ముతూ.. దిబ్రు-సైఖోనా నేషనల్ పార్క్ వద్ద బయో డైవర్సిటీకి పెను ముప్పును కలిగిస్తున్నాయి. ఇద్దరు అగ్నిమాపక ఉద్యోగులు ఈ మంటల కారణంగా ఇటీవల మరణించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు   ఏడు వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు చమురు క్షేత్రంలో పని చేసే సిబ్బందిపై స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ బ్లో-ఔట్ కు దారి తీసిన పరిస్థితులపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని సీఎం సర్బానంద సోనోవాల్ ఆదేశించారు.