Ashwini Vaishnaw: ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోంది.. WEF వేదికపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే.. వీడియో

ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోందని.. నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న అశ్విని వైష్ణవ్.. భారత్ లో పెట్టుబడులు పెట్టేలా పలు కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.

Ashwini Vaishnaw: ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోంది.. WEF వేదికపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే.. వీడియో
Ashwini Vaishnaw
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2024 | 8:53 PM

ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోందని.. నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న అశ్విని వైష్ణవ్.. భారత్ లో పెట్టుబడులు పెట్టేలా పలు కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ తరుణంలో సెమీకండక్టర్ పరిశ్రమ (చిప్) పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. పశ్చిమ దేశాలు వర్సెస్ చైనా చిప్ యుద్ధంలో భారత్ ఎలాంటి మార్గనిర్ధేశం ఇస్తుందనే దానిపై ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ అగ్రగ్రామిగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చైనాతో తమకెలాంటి పోలిక లేదని… భారత్ అగ్ర దేశం వైపు పయనిస్తుందని.. దీనికి ఆర్ధిక పరమైన నిర్ణయాలే నిదర్శనమని పేర్కొన్నారు.

అశ్విని వైష్ణవ్ వీడియో చూడండి..

సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రపంచ పూర్వ వైభవం కోసం, పరిశ్రమ గణనీయమైన పెరుగుదలలో AIని అభివృద్ధి చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల అధునాతన చిప్‌లపై ఎగుమతి నిషేధాలు అమలులోఉన్నాయి. ఈ తరుణంలో ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య శక్తి సంబంధాలలో పరిశ్రమ కేంద్రంగా ఉన్నందున ఈ పరిమితులు ఆధునిక చిప్‌మేకింగ్‌లో ఆవిష్కరణ, పోటీ ప్రకృతి దృశ్యం రెండింటిపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న విషయాలతోపాటు.. చైనా, భారత ఆర్థిక పరిస్థితి.. భవిష్యత్తు వ్యూహాల గురించి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..