Rajasthan: రాజస్థాన్ సీఎం కుర్చీ కోసం నేతల మధ్య పోటాపోటీ.. రెండు పదవులపై గెహ్లాట్ ఆసక్తి

రాజస్థాన్ లో సీఏం పీఠం ఎవరిని వరిస్తుందనేది మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత సీఏం అశోక్ గెహ్లాట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చనే చర్చ.. నేపథ్యంలో ఆయన హస్తినకు వెళ్తే తదుపరి రాజస్థాన్ సీఏంగా ఎవరుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా..

Rajasthan: రాజస్థాన్ సీఎం కుర్చీ కోసం నేతల మధ్య పోటాపోటీ.. రెండు పదవులపై గెహ్లాట్ ఆసక్తి
Gehlot, Cp Joshi, Sachin Pi
Follow us

|

Updated on: Sep 21, 2022 | 11:17 AM

Rajasthan: రాజస్థాన్ లో సీఏం పీఠం ఎవరిని వరిస్తుందనేది మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత సీఏం అశోక్ గెహ్లాట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చనే చర్చ.. నేపథ్యంలో ఆయన హస్తినకు వెళ్తే తదుపరి రాజస్థాన్ సీఏంగా ఎవరుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సీఏం పదవిని వదులుకోవడానికి అశోక్ గెహ్లాట్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికి.. సీఏంగానూ కొనసాగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయన ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగడం కష్టమని, సీఏంగా మరోవ్యక్తిని ఎంపికచేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తే ఆతరువాత రాజస్థాన్ సీఏం కుర్చీ కోసం తీవ్ర పోటీనెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన సచిన్ పైలట్ తో పాటు ప్రస్తుత స్పీకర్ సీపీ జోషి కూడా ముఖ్యమంత్రి పీఠంపై గురిపెట్టారు. గతంలోనే సీఏం పీఠం కోసం వీరిద్దరు పోటీపడినప్పటికి.. అధిష్టానం అశోక్ గెహ్లాట్ ను సీఏంగా ఎంపిక చేసింది. ప్రస్తుతం సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈఏడాది నవంబర్ లోపు పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించుకోవాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్ ను కూర్చోబెట్టాలని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయన్ను ఒప్పించారని.. ఈ నెల 28వ తేదీన ఆయన నామినేషన్‌ వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ కూడా బరిలోకి దిగనున్నారు. వీలైనంత ఎక్కువ మంది పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సోనియాగాంధీ నిశ్చయించినట్లు సమాచారం. ఇదే జరిగితే 1997 తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతరులే పోటీకి దిగినట్లు అవుతుంది. అలాగే పాతికేళ్ల తర్వాత ఆ పార్టీలో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్లు అవుతుంది. అధ్యక్ష పదవికి పోటీచేయనని ఇప్పటికే అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. దీంతో సోనియా గాంధీ మళ్లీ బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చాయి. అయితే తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయకూడదని వారిద్దరితో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో గాంధీ కుటుంబేతరులే ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువుగా ఉంది.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గహ్లాట్ కే ఎక్కువ అవకాశాలుండటంతో ఇప్పుడు తదుపరి రాజస్థాన్ సీఏం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు సీఏం పదవిని వదులుకోవడానికి అశోక్ గెహ్లాట్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని అశోక్ గెహ్లాట్ కోరుతూ వచ్చారు. అయినా రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక గెహ్లాట్ కే ఆపదవి దక్కే ఛాన్స్ స్పష్టంగా ఉంది. అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి వెళ్తే.. రాజస్థాన్ సీఏంగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది. గతంలో అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా గళం విప్పిన.. తన మద్దతు ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టారు సచిన్ పైలట్. ఆసమయంలో ఆయన బీజేపీలో చేరతారనే చర్చ విస్తృతంగా సాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇన్వాల్వ్ అయ్యి నచ్చజెప్పడంతో చివరికి ఆయన శాంతించి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కనుక కాంగ్రెస్ అధ్యక్షుడై హస్తినకు వెళ్తే.. ఇక తనకు లైన్ క్లియర్ అయినట్లేనని సచిన్ పైలట్ భావిస్తున్నారు.

మరోవైపు స్పీకర్ సీపీ జోషి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు. తాను కూడా సీఏం రేసులో ఉన్నానన్న సంకేతాలిస్తున్నారు. దీంతో రాజస్థాన్ తదుపరి సీఏంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. 2023 డిసెంబర్ వరకు రాజస్థాన్ శాసనసభ పదవీకాలం ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సచిన్ పైలట్ నే సీఏంగా చేయవచ్చనే ప్రచారం ఉంది. లేకపోతే ఏడాది సమయం ఉన్నందున తానే ఈఏడాది పాటు సీఏంగా కొనసాగుతానని అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేస్తే సోనియా, రాహుల్ గాంధీలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తంమీద కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక వేళ.. రాజస్థాన్ సీఏం ఎవరనే చర్చ నడుస్తోంది. ఒకవేళ అశోక్ గోహ్లాట్ అధ్యక్షుడైతే.. సీఏంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో గెహ్లాట్ నిర్ణయం కూడా కీలకం కానుంది. అదే జరిగితే అశోక్ గెహ్లాట్ సీపీ.జోషి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చే ఛాన్స్ ఎక్కువుగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఈవిషయంపై మరికొద్ది రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!