Asaduddin Owaisi: ‘వారు సరిగ్గా ఉంటే ఒవైసీ ఇక్కడికి వచ్చేవాడే కాదు’.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ..!
Asaduddin Owaisi: బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీపై ఎంఐఎం..
Asaduddin Owaisi: బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒవైసీ.. ‘ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల వారు సరిగ్గా ఉండుంటే ఒవైసీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవాడే కాదు’ అని వ్యాఖ్యానించారు. వారంతా మోదీ, ఆర్ఎస్ఎస్‌కి భయపడతున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు.. వారికి దేవుడంటే భయం లేదని, కేవలం వారి జీవితాలపైనే, వారి ప్రాణాలపై వారికి భయం ఉందంటూ ఎద్దేవా చేశారు. కానీ, ఏఐఎంఐఎం పార్టీ నేతలకు దేవుడంటే భయం, మనుషులకు భయపడరని ఒవైసీ వ్యాఖ్యానించారు. కొందరు తమను రాజకీయ కుట్రదారులమంటూ ఆరోపణులు చేస్తున్నారని ఉటంకించిన ఆయన.. ఆరోపణలు చేస్తున్నవారే నిజమైన రాజకీయ కుట్రదారులు అని విమర్శించారు ఒవైసీ. ‘హిందుత్వ వాదానికి హిందుత్వంలో కౌంటర్ ఇవ్వాలని వారు భావిస్తుంటారు. కానీ మేము మాత్రం హిందుత్వ వాదాన్ని రాజ్యాంగంతో, భారతీయ భావజాలంతో ఎదుర్కొంటాం.’ అంటూ అసదుద్దీన్ ఒవైసీపీ వ్యాఖ్యానించారు.
ANI Tweet:
AIMIM is accused of being a political conspirator. I say accusers are conspirators themselves. They want to counter Hindu nationalism with Hindu nationalism. We want to confront Hindutva with the Constitution, with Indian nationalism: AIMIM Chief Asaduddin Owaisi, in Ahmedabad https://t.co/eFg0st1Ggk pic.twitter.com/wsZKn3ZlWM
— ANI (@ANI) February 7, 2021
Also read: