Shiv Sena vs BJP: ముఖ్యమంత్రిని విమర్శించారని మరో పార్టీ కార్యకర్తపై ఇంక్ పోసి, బలవంతంగా చీర కట్టి..!
Shiv Sena vs BJP: మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతలు రెచ్చిపోయారు. తమ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు..
Shiv Sena vs BJP: మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతలు రెచ్చిపోయారు. తమ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేశాడనే కారణంతో ఓ బీజేపీ కార్యకర్తపై ఇంక్ పోశారు. దాంతో అతని దుస్తులన్నీ ఇంక్ మయం అయిపోయాయి. అలా ఇంక్ ఉండగానే.. వీధుల వెంట తరుముకుంటూ తీసుకువచ్చారు. అంతటితో ఆగని శివసేన నేతలు.. సదరు బీజేపీ నేతకు బలవంతంగా చీర కట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతంలో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ధ్వజమెత్తుతున్నారు బీజేపీ ముఖ్య నేతలు.
ANI Video Tweet on Shiv Sena Attack:
#WATCH I Maharashtra: Shiv Sena workers allegedly pour black ink on a BJP leader and forced him to wear a saree after the latter criticised Chief Minister Uddhav Thackeray, in Solapur pic.twitter.com/gdtL9gChT1
— ANI (@ANI) February 7, 2021
Also read: