ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు మరో చేదువార్త చెప్పింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని ప్రకటించింది. సాధారణగా జూన్ 1 లోపే కేరళను తాకే రుతుపవనాలు ఈసారి జూన్ 4 తర్వాత ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అంతే కాదు మరికొన్ని రోజులు ఎండల బాధ భరించాల్సి ఉంటుందని తెలిపింది. జూన్ మొత్తం ఎండల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొంది. రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా లేదని, ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఎండలను తాళలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రలు 45 డ్రిగీల పైగా నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
మరిన్ని వెదర్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..