Mehul Choksi: డొమినికా నుంచి నేరుగా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇండియాకు ‘రాక’ ? మాకొద్దు బాబూ ఆయన అంటున్న ఆంటిగ్వా !

Mehul Choksi: ఆంటిగ్వా నుంచి పరారై డొమినికాలో 'తేలిన' వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని అక్కడి నుంచి నేరుగా రప్పించేందుకు ఇండియా తన దౌత్య ప్రయత్నాలకు శ్రీకారం చుట్టనుంది.

Mehul Choksi: డొమినికా నుంచి నేరుగా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ  ఇండియాకు 'రాక' ?  మాకొద్దు బాబూ ఆయన అంటున్న ఆంటిగ్వా !
Mehul Choksi
Follow us

| Edited By: Phani CH

Updated on: May 27, 2021 | 1:44 PM

ఆంటిగ్వా నుంచి పరారై డొమినికాలో ‘తేలిన’ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని అక్కడి నుంచి నేరుగా రప్పించేందుకు ఇండియా తన దౌత్య ప్రయత్నాలకు శ్రీకారం చుట్టనుంది. డొమినికాలో నిన్న పట్టుబడిన ఈయనను డైరెక్ట్ గా ఇండియాకు పంపాలని ఆంటిగ్వా ప్రధాని గెస్టన్ బ్రౌన్ నిష్కర్షగా చెప్పేశారు. మెహుల్ తమ దేశ ప్రతిష్టను మంట గలిపాడని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. డొమినికాతో ఇండియాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే ఆ రిపబ్లిక్ కి మనం లక్ష కోవిద్ వ్యాక్సిన్లను ఉచితంగా పంపామని హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా మెహుల్ ఆ దేశానికి అక్రమంగా, చట్ట విరుద్ధంగా వెళ్లినందున అతడిని భారత్ కు అప్పగించడంలో ఇబ్బంది ఉండదని ఈ శాఖ భావిస్తోంది. ఆయనను వారు సులభంగా ఇండియాకు అప్పగించగలుగుతారని ఆంటిగ్వా ప్రధాని కూడా వ్యాఖ్యానించారు. మళ్ళీ తమ దేశంలోకి ఆయనను ప్రవేశించనివ్వబోమన్నారు. మాకు చోక్సీని అప్పగించవద్దని డొమినికాను కూడా కోరుతున్నా అన్నారు. క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొనేందుకు ఆయన ఇండియాకు వెళ్లాల్సిందే అని చెప్పారు. మా దేశం నుంచి పరారై మెహుల్ పెద్ద తప్పిదం చేశాడన్నారు. అయితే తన క్లయింటుకు భారత పౌరసత్వం లేదని, ఆయన ఆంటీగ్వాలోనే ఉండాలని ఆయన తరఫు లాయర్ వాదిస్తున్నారు. మెహుల్ చోక్సీ అప్పగింతకు సంబంధించి ఇండియా నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా దాన్ని పాటించరాదని ఆంటిగ్వా హైకోర్టు ఉత్తర్వు కూడా జారీ చేసిందని ఆయన తెలిపారు. మా క్లయింటును ఇండియాకు పంపేఉద్దేశమే లేదని పేర్కొన్నారు.

అసలు తన క్లయింటు తనకు తాను డొమినికాకు వెళ్లి ఉండకపోవచ్చునని, ఇది అనుమానాస్పదంగా ఉందని ఆ లాయర్ అన్నారు. ఆంటీగ్వాలో మెహుల్ రెండు కేసులను ఎదుర్కొంటున్నారు. తన పౌరసత్వానికి, ఇండియాకు తన అప్పగింతకు సంబంధించి ఆయనపై కోర్టులో రెండు కేసులు ఉన్నాయి. 2017 లో ఆంటిగ్వా పౌరసత్వం పొంది ఇండియాకు పరారయ్యాడు. తనపై బ్యాంకు ఫ్రాడ్ కేసులు దాఖలు కావడంతో మళ్ళీ అక్కడికి చెక్కేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. తక్కువ వివరాలతో కార్డు జారీ

Diet after Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు, తరువాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి.. తెలుసుకోండి ఇలా..