Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభం.. థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై అస్సాం సీఎం ఫోకస్? టీఎంసీ ఫైర్.!

మహారాష్ట్ర పాలిటిక్స్.. అసోంలో అగ్గి రాజేశాయి. గౌహతిలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Maharashtra Crisis: 'మహా' సంక్షోభం.. థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై అస్సాం సీఎం ఫోకస్? టీఎంసీ ఫైర్.!
Maharashtra Politics
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 23, 2022 | 12:32 PM

ఓవైపు అసోం వరదలతో విలవిలాడుతుంటే.. సీఎం హిమంత బిశ్వా శర్మ మాత్రం ఉద్దేవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది మేము అంటున్న మాట కాదు. టీఎంసీ నేతలది. రాష్ట్రం వరదలతో విలవిలలాడిపోతుంటే.. రక్షణ చర్యలు తీసుకోవడం మానేసి.. గౌహతీలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో శివసేన రెబల్స్‌కు ఆతిథ్యం కల్పించడమేంటని టీఎంసీ నేతలు.. అస్సాం సీఎంపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు.. రాజ్యసభ ఎంపీ రిపున్‌ బోరా నేతృత్వంలో టీఎంసీ కార్యకర్తలు శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌‌ను ముట్టడించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలు బయటకు రావాలని నినాదాలు చేశారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని ఆరోపించారు. రేడిసన్‌ బ్లూ హోటల్‌ ముందు ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న టీఎంసీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాసేపట్లో అన్ని శాఖల కార్యదర్శులతో ఉద్దవ్ థాక్రే వర్చువల్ భేటి..

కాసేపట్లో మహారాష్ట్ర సెక్రటేరియట్‌ మంత్రాలయలో అన్ని శాఖల కార్యదర్శులతో వర్చువల్‌గా భేటీ అవుతున్నారు ఉద్దవ్‌థాక్రే. ఈ సమావేశం తరువాత ఉద్ధవ్‌ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికి సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు ఉద్ధవ్‌థాక్రే. మరోవైపు ఎన్సీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు శరద్‌పవార్‌ . రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఉద్ధవ్‌థాక్రేకే తన మద్దతని ఇప్పటికే స్పష్టం చేశారు శరద్‌పవార్‌.

(టీవీ9 తెలుగు డెస్క్)

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?