Anil Antony: మీ ధోరణి ఇదేనా.. కేరళ నిరసన ఘటనపై కాంగ్రెస్,సీపీఎంలకు అనిల్ అంటోనీ సూటి ప్రశ్న..

| Edited By: Ram Naramaneni

Jul 27, 2023 | 8:22 AM

ఇండియా యూనియన్‌లో ముస్లిం లీగ్, కాంగ్రెస్, సీపీఎం, కేరళ సీపీఐఎంల స్పందన ఏంటి? దీనిపై కేరళ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతోంది? ఈ రకమైన మత విద్వేషం, హింసను వ్యాప్తి చేయడం కేరళ, భారతదేశంలో సాధారణమేనా? అంటూ బీజేపీ కేరళ ప్రతినిధి అనిల్ కె ఆంటోని ప్రశ్నించారు.

Anil Antony: మీ ధోరణి ఇదేనా.. కేరళ నిరసన ఘటనపై కాంగ్రెస్,సీపీఎంలకు అనిల్ అంటోనీ సూటి ప్రశ్న..
Follow us on

ఢిల్లీ, జూలై 26: నిన్న కేరళలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హింసాకాండకు గురైన మణిపూర్ ప్రజలకు మద్దతు తెలిపేందుకు ముస్లిం యూత్ లీగ్ నిర్వహించిన మార్చ్ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ర్యాలీలో స్లోగన్లు వినిపించాయి. ర్యాలీ జరిగిన తీరును ఇండియా మిత్ర పక్షాలను బీజేపీ కేరళ ప్రతినిధి అనిల్ కె ఆంటోని ప్రశ్నించారు. ఇండియా యూనియన్‌లోని ముస్లిం లీగ్, కాంగ్రెస్, సీపీఎం, కేరళ సీపీఎం స్పందన ఏంటి..? దీనిపై కేరళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది..? ఈ రకమైన మత విద్వేషం, హింసను వ్యాప్తి చేయడం కేరళ, భారతదేశంలో సాధారణమేనా..? అంటూ ట్వీట్ చేశారు అనిల్ కె ఆంటోని.

కన్హంగాడ్ నిరసనలోని దిగ్భ్రాంతికరమైన దృశ్యాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువులను లక్ష్యంగా చేసుకుని ముస్లిం లీగ్ చేస్తున్న నినాదాలు ఖండనీయం, సమర్థనీయం అస్సలు కాదు. పార్టీ ‘సెక్యులర్’ చర్యలకు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నందుకు ఈ ఉదంతమే ఆందోళనకరమైన మెసెజ్‌ అని బీజేపీ ఓ వీడియోను ట్వీట్‌లో పోస్ట్ చేసింది.

కేసు ఏంటి?

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా కన్హంగాడ్‌లోని మణిపూర్‌లో జరిగిన హింసకు వ్యతిరేకంగా ముస్లిం లీగ్ నిరసన తెలిపింది. ఇంతలో, లీగ్ సభ్యులు ద్వేషపూరిత నినాదాలు చేశారు. నినాదాలు చేసిన కన్హంగాడ్ మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ సలామ్‌ను ఆ పార్టీ నుంచి తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోజ్ తెలిపారు.

300 మందికి పైగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం సభ్యులు చేసిన నినాదాలు చేయడంపై  బుధవారం కేసు నమోదైంది. యూత్‌లీగ్‌ మార్చ్‌లో పాల్గొన్న 300 మందిపై బీజేపీ కన్‌హంగాడ్‌ మండల అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు హోస్‌దుర్గా పోలీస్‌స్టేషన్‌ అధికారి తెలిపారు.

మతం, జాతి, జన్మస్థలం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి, సామరస్యానికి హాని కలిగించే చర్యలకు పాల్పడినందుకు అతనిపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారులు తెలిపారు.

అసలు రాహుల్ ఏమన్నారు….

గత నెలలో అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్‌‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌‌లో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం గురించి మాట్లాడుతూనే.. కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)తో పొత్తు పెట్టుకోవడం లౌకికవాదానికి వ్యతిరేకం కాదా అని అక్కడి జర్నలిస్టులు ప్రశ్నించారు. రాహుల్ ఆన్సర్ ఇస్తూ.. ‘‘ముస్లిం లీగ్ అనేది పూర్తిగా సెక్యులర్ పార్టీ. ఆ పార్టీ విషయంలో నాన్ సెక్యులర్ అంటూ ఏమీ లేదు. ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి, ముస్లిం లీగ్‌ గురించి సరిగ్గా తెలుసుకోలేదని నా అభిప్రాయం’’” అని వ్యాఖ్యానించారు. ముస్లిం లీగ్‌‌ను రాహుల్ సెక్యూలర్ పార్టీగా ఆయన అభివర్ణించడంతో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాహుల్ విదేశాల్లో భారతదేశం పరువు తీస్తున్నారని విమర్శలు చేసింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం