- Telugu News Photo Gallery Rail Minister Ahwini Vaishnaw says Railways lost 55.60 lakh Rupees due to stone pelting on Vande Bharat trains
Vande Bharat: వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా ?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో దేశంలోని పలుచోట్లు కొంతమంది ఆకతాయిలు ఈ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగుచూసాయి. అయితే ఇలా రాళ్ల దాడి చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరించారు.
Updated on: Jul 26, 2023 | 6:59 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో దేశంలోని పలుచోట్లు కొంతమంది ఆకతాయిలు ఈ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగుచూసాయి. అయితే ఇలా రాళ్ల దాడి చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరించారు.

వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి చేయడం వల్ల ఇప్పటిదారా దాదాపు రూ.55.60 లక్షల వరకు నష్టం వచ్చిందని వెల్లడించారు. 2019 నుంచి నేటివరకు తమ శాఖకు జరిగిన ఆస్తినష్టం గురించి ఆయన బుధవారం లోక్‌సభలో తెలిపారు.

ఈ రాళ్ల దాడి ఘటనలకు సంబంధించి ఇప్పటిదాకా 151 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ చనిపోవడం గానీ, దొంగతనం జరగడం గానీ, ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు ధ్వంసం అవ్వడం జరగలేదని తెలిపారు.

ఇలాంటి విధ్వంసాలను అడ్డుకోవడానికి.. ప్రయాణికులను, రైల్వే ఆస్తులను రక్షించేందుకు ఆర్‌పీఎఫ్ అధికారులు జీపీఆర్/జిల్లా పోలీస్/అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగితే దాని పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

వందేభారత్ రైళ్ల విధ్వంసానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్కార్టింగ్ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొ్న్నారు. ఈ రాళ్ల దాడులను నివారించేందుకు మార్గదర్శకాలు జారీచేశామని తెలిపారు. అలాగే ఇందుకోసం రెగ్యులర్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.