- Telugu News Photo Gallery Govt says Kin of those killed in Pulwama attack got compensation of up to 2.94 crore Rupees
Pulwama Attack: పుల్వామా అమర వీరుల కుటుంబీకులకు ఎంత పరిహారం ఇచ్చారంటే ?
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటంబాలకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్లు పరిహారం అందజేసినట్లు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో తెలిపారు. 2019లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సీఆర్‌ఫీఎఫ్ జవాన్లు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Updated on: Jul 26, 2023 | 7:51 PM

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటంబాలకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్లు పరిహారం అందజేసినట్లు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో తెలిపారు. 2019లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సీఆర్‌ఫీఎఫ్ జవాన్లు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఉద్యోగాలు, సంబంధిత వివరాల జాబితాను ఆయన వివరించారు. జవాన్ల కుటంబాలకు పరిహారంతో సహా.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కొంతమంది దాతలు, కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన విరాళాలను సైతం అందిచామని పేర్కొన్నారు.

యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కిందిస్థాయి ఉద్యోగాల్లో కొందరు జాయిన్ అయ్యారని తెలిపారు. అలాగే చాలామంది జవాన్ల కుటుంబ సభ్యల నుంచి తమ కుమారులు 18 ఏళ్లు నిండిన తర్వాతే ఉద్యోగాలు ఇవ్వాలనే అభ్యర్థన వచ్చినట్లు పేర్కొన్నారు.

ఒక జవాన్ భార్యకు పంజాబ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా అవకాశం కల్పించగా.. మరొకరు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారని తెలిపారు.

జమ్మూకశ్మీర్ పరిధిలో జరిగిన ఈ దాడి దేశంలో అత్యంత దారుణమైన దాడుల్లో ఒకటిగా నిలిచిపోయింది. పుల్వామ అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని కొండపై నిర్మి్ంచాలని సీఆర్‌ఫీఎఫ్ యోచిస్తోంది. ఇందుకోసం రెండు ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు.