Punjab: లండన్ పారిపోయేందుకు యత్నించిన అమృత్ పాల్ సింగ్ భార్య.. అంతలోనే

|

Apr 20, 2023 | 2:17 PM

పంజాబ్ లో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరక్కుండా వారికి చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అతను పలు ప్రాంతాల్లో మారు వేషాలు వేసుకోని తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను గురువారం ఇమ్మిగ్రేషన్ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు.

Punjab: లండన్ పారిపోయేందుకు యత్నించిన అమృత్ పాల్ సింగ్ భార్య.. అంతలోనే
Amrit Pal Singh And Karandeep Kaur
Follow us on

పంజాబ్ లో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరక్కుండా వారికి చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అతను పలు ప్రాంతాల్లో మారు వేషాలు వేసుకోని తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను గురువారం ఇమ్మిగ్రేషన్ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు. ఆమె అమృత్‎సర్ ఏయిర్‎పోర్టు నుంచి లండన్ పారిపోయేందుకు ప్రయత్నంచగా  ఆమెను అడ్డుకున్నారు. అయితే ఆమెను విచారించేందుకే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ కు సంబంధించిన దగ్గరి బంధు మిత్రులకు దేశం నుంచి విడిచి వెళ్లకుండా సర్క్యూలర్ కూడా వెళ్లింది.

అయితే కిరణ్ దీప్ కౌర్‌కు యూకే పౌరసత్వం ఉంది. ఆమెపై దేశంలో గాని.. పంజాబ్ లో గాని ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఆమె యూకేలో ఉన్నప్పుడు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో సభ్యురాలు అనే విషయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే పంజాబ్ పోలీసులు కూడా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
అమృత్ పాల్ సింగ్ కార్యకలపాలకు సంబంధించి విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను మార్చిలో పోలీసులు విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమృత్ పాల్ సింగ్ ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె పంజాబ్ కే వచ్చేసింది. ప్రస్తుతం ఆమె అమృత్ పాల్ సింగ్ పూర్వికుల గ్రామమైన జల్లుపూర్ ఖేడా లో ఉంటోంది.
ప్రస్తుతం ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.