Amit Shah: వాళ్లందరు కుంభకోణాల్లో భాగస్వాములే.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
బిహార్‌లోని పట్నాలో జరిగిన విపక్షాల భేటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారందరికి కూడా వివిధ స్కాముల్లో తమ హస్తం ఉందని చురకలటించారు. దాదాపు రూ.20 లక్షల విలువైన కుంభకోణాల్లో వారందరూ భాగస్వాములేనని ఆరోపించారు. ఇలాంటి అవినీతి నాయకులందరికీ ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

బిహార్‌లోని పట్నాలో జరిగిన విపక్షాల భేటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారందరికి కూడా వివిధ స్కాముల్లో తమ హస్తం ఉందని చురకలటించారు. దాదాపు రూ.20 లక్షల విలువైన కుంభకోణాల్లో వారందరూ భాగస్వాములేనని ఆరోపించారు. ఇలాంటి అవినీతి నాయకులందరికీ ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. విపక్షాల సమావేశం తర్వాత ఆయన తొలిసారిగా బిహార్ లో పర్యటించారు. అక్కడి ముంగేర్ పార్లమెట్ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఎన్డీయేను వదిలేసి ‘మహాఘట్‌బంధన్’ ఏర్పాటు చేసిన నేతలకూ శిక్ష పడుతుందని నీతీశ్ కుమార్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో ప్రధాని మోదీ దేశానికి ఎంతో చేశారన్నారు. కూటములు మార్చడం తప్ప బిహార్‌కు నీతీశ్ ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిలయ్యారని విమర్శించారు. ఇప్పటికే ప్రధాని పట్ల దేశ ప్రజలకు విశ్వాసం ఉందని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే ప్రధాని కాబోతున్నారని చెప్పారు. మహఘట్‌బంధన్ ప్రభుత్వం హయంలో బిహార్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం




