Rahul Gandhi: మణిపుర్‌లో రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. చివరికి
మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గరువారం రోజున అక్కడికి చేరుకున్న ఆయన ఘర్షణలకు ఎక్కువగా జరుగుతున్న చురాచాంజ్ జిల్లాకు పయనమయ్యారు. కానీ రాహుల్ అలా తన కాన్వాయ్‌లో వెళ్తుండగానే పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు.

మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గరువారం రోజున అక్కడికి చేరుకున్న ఆయన ఘర్షణలకు ఎక్కువగా జరుగుతున్న చురాచాంజ్ జిల్లాకు పయనమయ్యారు. కానీ రాహుల్ అలా తన కాన్వాయ్‌లో వెళ్తుండగానే పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అనంతరం దీనిపై పోలీసులు స్పష్టతనిచ్చారు. భద్రత దృష్ట్యా ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద రాహుల్ కాన్వయ్‌ను ఆపివేసినట్లు తెలిపారు. చూరాచాంద్‌పూర్ కు రోడ్డుపై కాకుండా హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక చేసేదేమి లేక రాహుల్ గాంధీ తిరిగి హెలికాప్టర్‌లో చురాచాంద్‌పూర్ వెళ్లారు.
రాహుల్ గాంధీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ వర్గాలు తెలిపిన షెడ్యూల్ ప్రకారం ఆయన చురాచంద్‌పూర్ వెళ్లాక అక్కడ శిబిరాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం శుక్రవారం ఇంఫాల్‌లోని శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలను పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా మణిపుర్‌లో మెయిటీ, కుకీ జాతీల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘర్షణలో 100 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 50 వేల మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు మణిపుర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనం ప్రదర్శించడంపై కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మణిపుర్‌లో శాంతి నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.




మరిన్ని జాతీయ వార్తల కోసం




