Viral video: కరెంటు కోతలు బరించలేక ఏటీఎంలో ఆశ్రయం పొందిన కుటుంబం.. వీడియో వైరల్!
తరచూ కరెంటు కోతలతో విసిగిపోయిన ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం అందరికి దృష్టిని ఆకర్షిస్తోంది. తీవ్ర కరెంటు కోతలు, ఇంట్లో వేడిన తట్టుకోలేకపోయిన మహిళ కుటుంబంతో కలిసి ఏటీఎం దగ్గరకు వెళ్లింది. తన పిల్లలతో పాటు రాత్రి ఆ ఏటీఎంలోనే నిద్రపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో తరచుగా విద్యుత్ కోతలు సంభవిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఒక కుటుంబం తీవ్రమైన వేడితో అల్లాడిపోయింది. వేడి వాతావరణం నుండి తప్పించుకోవడానికి కుటుంబంతో సహా వెళ్లి ఒక ATM బూత్‌లో ఆశ్రయం పొందింది. రాత్రి మొత్తం అక్కడే నిద్రపోయింది. అయితే ఆ కుటుంబం ఏటీఎం బూత్ లోపల విశ్రాంతి తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియో వైరల్ అయి యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దృష్టికి చేరింది. దీంతో ఆయన ఈ వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ స్థానిక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం Xలో వీడియోను పోస్ట్ చేసిన అఖిలేష్ యాదవ్.. కరెంటు కోతలను తట్టుకోని పేద ప్రజలు ఏటీఎంలో ఆశ్రయం పొందుతున్నారు.. యూపీ విద్యుత్ శాఖ.. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
बिजली कटौती के मारेएटीएम जा पहुँचे बेचारे
उप्र बिजली विभाग, जिसकी ख़ुद की बत्ती गुल है।
कोई है? pic.twitter.com/uHufVHJItN
— Akhilesh Yadav (@yadavakhilesh) May 21, 2025
అయితే ఆయన షేర్ చేసిన వీడియోలో ఉన్న మహిళ మీడియాతో మాట్లాడుతూ ఇలా అంది.. తమ ప్రాంతంలో గత నెల రోజులుగా తరచూ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నామని చెప్పింది. మా ప్రాంతంలో నిరంతర కరెంటు, ఎయిర్ కండిషనింగ్ ఉన్న ఏకైక ప్రదేశం ఇదొక్కటేనని.. అందుకే తన కుటుంబం మొత్తం ఏటీఎం వద్దకు వచ్చి ఆశ్రయం పొందామని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా తాము ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నామని ఇప్పటివరకు ఎవరూ తమను అడ్డుకోలేదని మహిళ తెలిపింది. కానీ ఎవరైనా అడ్డుకుంటే తాము రోడ్డుపై పడుకోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
