AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. తర్వాత ఈ దారుణాన్ని పక్కింటి వారిపై నెట్టేసింది. తన భర్తను పక్కింటి వారే హత్య చేశారని పోలీసులను నమ్మించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో మహిళ భాగోతం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది.

భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!
Up Crime
Anand T
|

Updated on: May 22, 2025 | 12:31 AM

Share

రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. మనుషులు వావీ వరుసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న వాళ్లనే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం.  అయితే తాజాగా ఇలాంటి ఘటనే యూపీలోని మరోకటి వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌లో నివాసం ఉంటున్న ధర్మేంద్ర అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో హత్య చేయబడ్డాడు. అయితే తన భర్తలను పక్కింటి వారే హత్య చేశారని ధర్మేంద్ర భార్య రీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రాక్టర్ రిపేర్ విషయంలో తన భర్త ధర్మేంద్ర తో పక్కింటి వారు గొడవ పడ్డారని.. దీంతో వారే తన భర్తను హత్య చేసి ఉంటారని ధర్మేంద్ర  భార్య రీనా ఆరోపించింది. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కింటి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే అరెస్టైన వారు మాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం, హత్య గురించి ధర్మేంద్ర భార్య చెప్పిన కొన్ని విషయాలు పోలీసులలో అనుమానాన్ని లేవనెత్తాయి. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ధర్మేంద్ర హత్య ఇంటి బయట జరిగిందని రీనా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఇంటి లోపల రక్తపు మరకలను గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటిబయట కాకుండా ఇంటి లోపలికి వెళ్లే ఆగిపోయింది. దీంతో రీనా మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించారు. అయితే ఈ హత్య జరిగిన రోజు రీనా తన మేనల్లుడైన సతీష్‌తో 40 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రీనాకు, ఆమె మేనల్లుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. సతీష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం సతీష్ పోలీసులకు వివరించాడు. రీనానే తన భర్తకు మత్తుమందు ఇచ్చి.. అతను నిద్రపోయిన తర్వాత తలను మంచం కోడుకు బాది హత్య చేసిందని తెలిపాడు. సతీష్ ఇచ్చిన వాంగ్మూలంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడంతోనే అతన్ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!