‘ముందుంది పెద్ద ముప్పు, ఇది ట్రైలర్ మాత్రమే !’ ముకేశ్ అంబానీకి జైష్-ఉల్-హింద్ బెదిరింపు మెసేజ్.

ముంబైలోని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు  పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన బాధ్యత తమదేనని జైష్-ఉల్-హింద్ అనే సంస్థ ప్రకటించింది..

  • Umakanth Rao
  • Publish Date - 11:10 am, Sun, 28 February 21
'ముందుంది పెద్ద ముప్పు, ఇది ట్రైలర్ మాత్రమే !' ముకేశ్ అంబానీకి జైష్-ఉల్-హింద్ బెదిరింపు మెసేజ్.
అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో ట్విస్ట్: కారు ఓనర్ అనుమానాస్పద మృతి

ముంబైలోని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు  పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన బాధ్యత తమదేనని జైష్-ఉల్-హింద్ అనే సంస్థ ప్రకటించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పెద్ద ముప్పు ముందుందని ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ మెసేజ్ లో హెచ్చరించింది. మీ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన మా వాహనం ‘సేఫ్ హౌస్’ ను చేరింది. బిట్ కాయిన్ ద్వారా మాకు డబ్బులు చెల్లించండి అని ఈ సంస్థ కోరింది. అంబానీ ఇంటివద్ద అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు.  కాగా మీరు ఆపగలిగితే మమ్మల్ని ఆపండి అని కూడా ఈ సంస్థ పోలీసులకు సవాల్ విసిరింది. అల్లాను గానీ, చివరి రోజును గానీ నమ్మనివారు.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని …ఇంకా ఇలాగే పలు హెచ్ఛరికలు చేసింది ఈ సంస్థ. మా డిమాండుకు మీరు ఒప్పుకోకపోతే మా ఎస్ యూ వీ వాహనం మీ ఇంట్లో చొరబడుతుందని, డబ్బును ట్రాన్స్ ఫర్ చేయాలంటూ గతంలోనే కోరామని జైష్-ఉల్-హింద్ సభ్యులు ఈ సందేశంలో పేర్కొన్నారు.

అంబానీ ఇంటివద్ద పార్క్ చేసి ఉన్న వాహనంలో వదిలిన లేఖలో ఆయన భార్య నీతా అంబానీ పేరిట కూడాబెదరింపు లేఖ ఉంది. ఈ వాహనంలో జిలిటెన్ స్టిక్స్ ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడుకు తమదే బాధ్యత అని ఈ సంస్థ లోగడ ప్రకటించుకుంది. దమ్ముంటే దర్యాప్తు సంస్థలు తమను ఎదుర్కోవాలని, ఢిల్లీలో మేమేం చేసినా మీరేమీ చేయలేరని కూడా ఈ సంస్థ.. జాతీయ దర్యాప్తు సంస్థను కూడా హెచ్ఛరించింది. ఇజ్రాయెల్ కు చెందిన మోసాద్ ఇంటెలిజెన్స్ అంస్థతో మీరు చేతులు కలిపారు. కానీ విఫలమయ్యారు. మా జాడ కనిపెట్టలేకపోయారు.. ఈ సారి కూడా విఫలమవడం ఖాయం అని జైష్-ఉల్-హింద్ సంస్థ ఛాలెంజ్ విసిరింది.  అల్లా అనుమతితో మీరు ప్రతిసారీ ఫెయిలవుతున్నారు అని వ్యంగ్యంగా పేర్కొంది. పోలీసులు ఈ బెదరింపులను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు మొలలు పెట్టారు. అంబానీ ఇంటి వద్ద భద్రతను పెంచారు.