భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు షురూ.. ఢిల్లీ- షాంఘై మధ్య నాన్-స్టాప్..!
ఇప్పటికే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ గతవారం షాంఘై- ఢిల్లీ మధ్య 95 శాతం ఆక్యుపెన్సీతో విమానాలను నడిపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత భారత్‌కకు నేరుగా విమాన సర్వీసులను నడిపిన చైనా తొలి విమానయాన సంస్ధగా చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఇండిగో కూడా తన సర్వీసులను ప్రారంభించింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా భారత్- చైనా మధ్య విమాన సర్వీసులను కొనసాగించబోతోంది.

భారత్, చైనా మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది ఎయిర్‌ఇండియా. 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ- షాంఘై సర్వీసును ప్రారంభించే ఛాన్స్ ఉంది. ముంబై- షాంఘై కొత్త మార్గంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసినట్టు ఎయిర్‌ఇండియా అధికారులు తెలిపారు. భారత్-చైనా విమాన సర్వీసుల వల్ల ప్రయాణికులు వ్యాపార, వాణిజ్య, వైద్య సంరక్షణ, విద్యా, సాంస్కృతిక రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. వారానికి నాలుగు సార్లు ఢిల్లీ- షాంఘై మధ్య విమాన సర్వీసులను కల్పించే అవకాశం ఉంది.
ఇప్పటికే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ గతవారం షాంఘై- ఢిల్లీ మధ్య 95 శాతం ఆక్యుపెన్సీతో విమానాలను నడిపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత భారత్‌కకు నేరుగా విమాన సర్వీసులను నడిపిన చైనా తొలి విమానయాన సంస్ధగా చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఇండిగో కూడా తన సర్వీసులను ప్రారంభించింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా భారత్- చైనా మధ్య విమాన సర్వీసులను కొనసాగించబోతోంది. దీంతో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




