Air India privatisation: టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా.. ఎంతకు దక్కించుకున్నారో తెలుసా..?

|

Oct 08, 2021 | 5:31 PM

ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌ వశమైంది. టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా తిరిగి వచ్చేసింది. ఇప్పటి వరకు ఇది క్వశ్చన్‌ మార్క్. ఇప్పుడు అఫిషియల్ అనౌన్స్‌మెంట్.

Air India privatisation: టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా.. ఎంతకు దక్కించుకున్నారో తెలుసా..?
Tata Sons
Follow us on

ఎయిర్ ఇండియాను ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్‌ గ్రూప్‌ సొంతం చేసుకుంది. కొద్దిరోజులుగా ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిందని వస్తున్న వార్తలను ఎట్టకేలకు నిజం చేసింది సంస్థ. తాజాగ కేంద్రం ఎయిర్ ఇండియాని అమ్మకం కోసం ఓపెన్‌ బిడ్‌లను ఆహ్వానించింది. ఇందులో టాటా సన్స్ గ్రూప్ రూ.18వేల కోట్లతో దక్కించుకుంది. ఈ ఓపెన్‌ బిడ్‌లో టాటాకు పోటీగా స్పైస్‌ జెట్‌ పోటీ పడినప్పటికి టాటా సన్స్‌దే పైచేయిగా నిలిచింది. టాటా బిడ్‌ను కేంద్ర మంత్రుల కమిటీ కూడా ఆమోదించింది. ఈవిషయాన్ని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తహిన్​కాంత పాండే అధికారికంగా ప్రకటించారు.

ఎయిరిండియా ప్రస్థానం 1932లో మొదలైంది. JRD టాటా నేతృత్వంలో టాటా ఎయిర్‌లైన్స్‌ ఆవిర్భావించింది. కరాచి నుంచి ముంబైకి తొలి విమానం నడిపారు. ఇండిపెండెన్స్‌కు ముందు 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరును ఎయిరిండియాగా మార్చారు. స్వాతంత్ర్యం తర్వాత ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 1953లో ఎయిరిండియాను జాతీయం చేసుకున్న కేంద్రం.. తాజాగా 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. డిసెంబర్‌ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్‌ చేతికి రానుంది. దీంతో 67 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది. ప్రైవేటు రంగంలో పరిశ్రమల పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్రం తీసుకున్న పాలసీని స్వాగతించారు టాటా గ్రూప్స్‌ చైర్మన్ రతన్‌ టాటా. ఎయిర్‌ ఇండియాను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వెల్‌ కమ్ బ్యాక్ ఎయిరిండియా అంటూ ట్వీట్ చేశారు.

నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గ‌తంలోనూ ప్రయ‌త్నాలు జ‌రిగాయి. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా స్పైస్‌ జెట్‌, టాటా సన్స్‌ బిడ్స్‌ వేశాయి. ఈ బిడ్‌ను టాటా సన్స్‌ గెలుచుకోవడంతో భారీ న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇక టాటా స‌న్స్ చేతుల్లోకి వెళ్లనుంది.ప్రస్తుతం రూ. 61,562 కోట్ల అప్పుల్లో ఉంది ఎయిరిండియా. ఎయిరిండియాకి చెందిన రూ. 14,718 కోట్ల భూములు కేంద్రానికే చెందనున్నాయి.

Also Read: ఆ కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఈనెల 12న శిక్ష ఖరారు

Telangana: యాదగిరిగుట్టలో పిల్లి మిస్సింగ్‌ కేసు.. పిల్లలు అన్నం తినడం లేదని ఆవేదన